దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరుగుతున్నాయి. పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు వైఎస్సార్. కఠిన నిబంధనలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందేలా చూశారు. వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతుకు కష్టమొస్తే తాను అండగా నిలుస్తానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భరోసా కల్పించారు.
 
సంక్షేమానికి పర్యాయపదం వైఎస్సార్ అని ఆయన అమలు చేసిన పథకాలను పొందిన లబ్ధిదారులు భావిస్తారు. వైఎస్సార్ కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిన నేతలు ఉండొచ్చు కానీ వైఎస్సార్ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాలను అందించిన నేతలు మాత్రం లేరనే చెప్పాలి. 15 సంవత్సరాల క్రితమే లక్ష కోట్ల వ్యయంతో జలయజ్ఞం కింద 86 ప్రాజెక్ట్ లను ఆయన చేపట్టారు.
 
వైఎస్సార్ పేరు వినిపిస్తే ఆయన స్వచ్చమైన చిరునవ్వు కళ్ల ముందు మెదులుతుంది. అప్పట్లో మండుటెండలో పాదయాత్ర చేసి వైఎస్సార్ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడంలో సక్సెస్ అయ్యారు. తన పాలనలో వైఎస్సార్ ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట వేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం డ్వాక్రా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చిందనే చెప్పాలి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదని వైఎస్సార్ భావించారు.
 
చదువు వల్లే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని భావించిన మహానేత వైఎస్సార్ చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. 2004 నుంచి 2009 వరకు పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఏపీలో ఎగుమతులు భారీ స్థాయిలో పెరగడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత కూడా వైఎస్సార్ కే సొంతమని చెప్పవచ్చు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: