ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూలింగ్ ను అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు.. ఇచ్చిన హామీలను నెరవేర్చి దిశగా అడుగులు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్లను పంపిణీ చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ఫ్రీ బస్సు తరహాలోనే ఏపీలో కూడా త్వరలోనే ఆ బస్సు సౌకర్యం రాబోతుంది.  ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ఎన్నికల కంటే ముందు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేసేందుకు ముందుకు వచ్చారట చంద్రబాబు.


ఈ పథకంలో భాగంగా ప్రతినెల 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి అలాగే మహిళలకు 1500 రూపాయలు ఇవ్వనుంది  తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దీనికోసం తాజాగా విధివిధానాలు అలాగే... ఈ పథకం కోసం ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి అనే దానిపై చర్చ జరుగుతోందట. అయితే ఈ విషయం బయటికి రావడంతో...  దానికి సంబంధించిన సోషల్ మీడియాలో... ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ పథకం కోసం...  ఇలాంటి జిరాక్స్  లు అవసరం అవుతాయో అనే వివరాలను ఇందులో... పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని ప్రకారం.. ఆడబిడ్డ నిధి పథకం కోసం.... ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు, పుట్టిన తేదీ దృవపత్రం, రేషన్ కార్డు, 18 సంవత్సరాలు నిండినట్టు చూపించే టెన్త్ మెమో, చదువు లేని వారు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందట. ఈ సర్టిఫికెట్లన్నీ ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే ఛాన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: