వైయస్సార్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమందికి గుండెల్లో నిలిచిపోయిన మహా నాయకుడిగా పేరు సంపాదించారు.. ఆయనకు జనం నాడి బాగా తెలుసు ఎందుకంటే ఆయన పేరు పొందిన ప్రజా వైద్యుడే కాకుండా కేవలం ఒక్క రూపాయి డాక్టర్ గా కూడా ఎంతో సేవలు అందించారు వైయస్సార్.. ఆయన తన వైద్య విద్యను పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పులివెందులలో డాక్టర్ గా తన ప్రాక్టీసును సైతం మొదలుపెట్టారు. డాక్టర్ గా ఉన్న సమయంలో రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదు.. కానీ ప్రజలకు వైద్యం అందించాలని కోరిక మాత్రం ఉండేదట.


ఆయన ప్రజా వైద్యుడిగా సాధించిన పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలా పేరు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆహ్వానం లభించింది అలా యువజన నాయకుడుగా కూడా వైయస్సార్ తన రాజకీయ జీవితాన్ని సైతం మొదలుపెట్టారు. పులివెందుల యూత్ కాంగ్రెస్ లీడర్ గా మొదటిసారి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలడంతో కాంగ్రెస్ తరపున 1978లో ఎన్నికలలో పోటీ చేశారు. ఆ రోజుల్లో చిన్న పాంప్లెట్లు మీద ఉన్న తన వివరాలు అన్ని రాసి కూడా వైఎస్ఆర్ జనాలలో వాటి ద్వారా పంపించేవారట. తనకి ఓటు వేయమని చెప్పేవారట.


కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న, జనతా పార్టీ మీద గట్టి పోటీ ఉన్నప్పటికీ పులివెందుల ప్రజలు వైయస్సార్ ని నేతగా ఎంచుకోవడం జరిగింది. అలా మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. అలా గెలిచిన రెండేళ్లకు 1980లో ఆయన అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశారట. 1983 నుంచి 1985 వరకు రెండేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి పిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. అలా 1998 నుంచి 2000 దాకా చేశారు. 1989 నుంచి 1998 వరకు నాలుగు సార్లు ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారట.

అయితే 1969 నుంచి 2004 వరకు వేచి చూసిన రాజశేఖర్ రెడ్డి కి సీఎంగా వైయస్ఆర్ సరికొత్త ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి వంటి వాటితోనే ముందుకు వెళ్లారు.. వైయస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఉచితంగా విద్య, ఫీజు రిమెంబర్స్, ఉచిత కరెంటు, ఇతరత్రా వాటిని కూడా ప్రారంభించి ఏపీ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ ఆయన పేరు మీదే చాలామంది నేతలు కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. 2009 ఎన్నికలలో మరొకసారి గెలిచిన రాజశేఖర్ రెడ్డి కేవలం మూడు నెలల కాలంలో హైలీఫ్కాటర్ ప్రమాదంలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: