ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నాయి. గతంలో కంటే వేడి వాడిగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... వైసిపి పార్టీ నేతలను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసిపి నేతలను... టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం కూటమి నేతలు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు... రంగం సిద్ధం చేస్తుంది టిడిపి.


అంతేకాకుండా వైసిపి కార్యాలయాలకు వరుసగా నోటీసులు ఇచ్చి ధ్వంసం చేసే కార్యక్రమానికి కూడా.... శ్రీకారం చుడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక ముఖ్యంగా వైసీపీ పాలనలో... ఫైర్ బ్రాండ్ గా ఉన్న  నేతలను ఇప్పుడు టార్గెట్ చేస్తుంది టిడిపి. ఇందులో భాగంగానే మాజీమంత్రి  జోగి రమేష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం.


జోగి రమేష్ పైన అలాగే ఆయన కుటుంబం పైన కూడా వరుసగా కేసులు పెడతోంది కూటమి సర్కార్. ఇక తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ భూ వివాదంపై రంగంలోకి దిగింది సీఐడీ బృందం. ఏ క్షణమైనా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సమాచారం.  తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టు జోగి కుమారుడు రాజీవ్, బాబాయ్ వేంకటేశ్వర రావులపైన ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తతంగం అంతా జోగిరమేష్‌ ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం.


మొత్తం లావాదేవీలపై క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేసింది సీఐడీ బృందం. డాక్యుమెంట్ అవిడెన్స్ తో సహా నివేదికను డీజీపీకి సమర్పించింది సీఐడీ బృందం. ఇప్పటికే ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను డీజీపీకి ఇచ్చారట బెజవాడ పోలీసులు. ఈ వ్యవహారంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై వేటు వేశారు కలెక్టర్. అటు జోగి కుమారుడు, బాబాయ్ పై సీఐడీ కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందట. ఈ తరుణంలోనే.. ఏపీలో ఉంటే.. తనను అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉందని విదేశాలకు జోగి  రమేష్‌ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: