ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్ర‌భుత్వం కేంద్రం పైన ఆధారపడక తప్పట్లేదు. ఎందుకంటే అప్పులు తిప్పలు అలాంటివి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాజా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవలసి పరిస్థితి వచ్చింది. మరోవైపు కేంద్రం నుండి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి మంచి మద్దతు ఉండడంతో దానిని క్యాష్ చేసికోవాలని చూస్తున్నారు బాబు. విషయం ఏమిటంటే... కేంద్రం నుంచి త‌గిన‌న్ని ఎక్కువ నిధులు తీసుకువ‌చ్చి.. ఏపీ ఉన్న ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు కూట‌మి స‌ర్కారు సీఎం చంద్ర‌బాబు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే బాబు తాజాగా 2 రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కేంద్రం పెద్ద‌ల‌ను కూడా క‌లుసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ వంటివారితో భేటీ అయి.. ఏపీ దుర్భర ప‌రిస్థితిని వివ‌రించారు బాబు. ఈ నెలలో ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి విరివిగా సొమ్ములు కేటాయించాల‌ని సీఎం చంద్ర‌బాబు అడిగినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చేందుకు త‌న 16 మంది ఎంపీల‌తోనూ మ‌ద్ద‌తిస్తున్న నేప‌థ్యంలో మోడీకి కూడా చంద్ర‌బాబు కోరిక‌ల‌ను తీర్చాల్సిన అవ‌స‌రం అయితే ఏర్ప‌డింది. కాబట్టి బాబుని బుజ్జగించే పనిలో పడ్డారు మోడీ స‌ర్కారు వారు. అయితే చంద్ర‌బాబు ఎంత మేర‌కు నిధులు అడిగారు? ఏయే ప్రాజెక్టుల‌ పేరు చెప్పి సొమ్ములు అడిగారు? అన్న విషయాల ఇంకా ఇంకా స్పష్టత రావలసి ఉంది.

అయితే.. తాజాగా బ్లూంబ‌ర్గ్ సంస్థ ఓ నివేదిక విడుద‌ల చేస్తూ... త్వరలో విడుదల కాబోయే బడ్జెట్ పై ఊహాగానాలు చేస్తూ... కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఏయే రాష్ట్రాల‌కు కేంద్రం ఎంతెంత సొమ్ము ముట్టజెప్పుతుంది? ఆయా రాష్ట్రాలు ఎంతెంత సొమ్మును ఆశించాయి? అనే విష‌యాల‌ను ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. దీని ప్ర‌కారం చూసుకుంటే మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే... చంద్ర‌బాబు స‌ర్కారు.. కేంద్రాన్ని వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ.ల‌క్ష కోట్ల మేర‌కు సాయం చేయాల‌ని కోరిన‌ట్టు ఈ నివేదికలో చెప్పుకొచ్చారు. దీనిలో పోల‌వ‌రం, అమ‌రావ‌తి ప్రాజెక్టుల‌ను కూడా జ‌త చేసింద‌ని తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని కోరిన‌ట్టు నివేదిక తెలిపింది. అయితే ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజుల వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: