- రాజ‌కీయ ప్ర‌స్థానంలో వైఎస్సార్ మార్క్ న‌భూతోః
- వెలిగొండ‌, పోల‌వ‌రం, ఉచిత క‌రెంటుతో రైతు బాంధ‌వుడు
- ఆరోగ్య‌శ్రీతో కొన్ని ల‌క్ష‌ల ప్రాణాలు కాపాడిన దాత‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

రాజకీయ ప్రస్థానంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మార్క్ నభూతో అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. పేదల పక్షపాతిగా, రైతు బంధువుడిగా, కార్మిక శ్రామిక వర్గాలకు ఆపన్న నాయకుడిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈరంగం - ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల వారిని, అన్ని వర్గాల వారిని రాజశేఖర్ రెడ్డి తనవారిగా చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. అప్పటివరకు కార్పొరేట్ వైద్యానికి ధనికులు మాత్రమే పరిమితం అయినటువంటి పరిస్థితిని పేదలకు చెరువ చేసినటువంటి నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.


ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతూ పేదల పక్షపాతిగా ఆయన పేరు తెచ్చుకు న్నారు ముఖ్యంగా కార్పొరేట్ వైద్యం కేవలం ధనికులకు మాత్రమే పరిమితం అయినటువంటి రోజుల్లో అదే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినటువంటి ముఖ్యమంత్రిగా  పేరు తెచ్చుకున్నారు. గ్రామీణ స్థాయిలో 104, పట్టణ స్థాయిలో 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆపన్న హస్తం అందించారు. అప్పటివరకు కేవలం చిన్నపాటి స్థలాలను మాత్రమే పేదలకు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేటటువంటి పరిస్థితి ఉన్న ప్రభుత్వాల కారణంగా అనేకమంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


అటువంటి పరిస్థితిని మారుస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన మార్కును వేశారు. అదే విధంగా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించడంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎక్కడ ఉన్నా ఏం చేసినా రైతు బాంధవుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా జల యజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ, పోలవరం వంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. కొన్ని ప్రాజెక్టులు ఆయన హయాంలోని ముందుకు వెళ్లాయి.


తర్వాత కాలంలో విభజన కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు కొన్ని కొన్ని పథకాలు నిలిచిపోయాయి. ఎలా చూసుకున్నా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన టువంటి ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతూ ఉండటం గ‌మ‌నార్హం. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసినటువంటి రాష్ట్రంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండటం మరో విశేషం. పేదలకు ప‌ట్టెడ‌న్నం పెట్టాల‌ని, పేదలకు వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపడాలని తపించినటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర నభూతో న భవిష్యత్తు అనడంలో ఎటువంటి సందేహము లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: