దీంతో తెచ్చిన అప్పు ఏడు వేల కోట్ల రూపాయల పూర్తిగా కర్పూరంలా కరిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మళ్లీ ఇప్పుడు ఆదాయం లేదు ఏం చేయాలి మరొకవైపు ఉచిత ఇసుక అంటూనే.. ఇసుక మీద ఆదాయం కోల్పోయినట్టే కాబట్టి అప్పుల కోసం వేరే చోటకి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది.. ఇదేవిధంగా రాబోయే రోజుల్లో మరో 20 రోజులలో 3000 కోట్లకు పైగా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరగబోతోంది.. ఈ నేపథ్యంలో గత హయంలో ఏదైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అలాంటి ఆరోపణలు కూడా ఏపీ సీఎం ముందు ఉండబోతున్నాయి.
విపక్షాలు బలంగా లేకపోయినప్పటికీ ప్రజలు మాత్రం కచ్చితంగా నిలదీస్తారని చెప్పవచ్చు. నాడు జగన్ కు ఏది వ్యతిరేకత అయ్యి వచ్చిందో ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే చిక్కుల్లో పడేలా చేస్తోంది.మరి చంద్రబాబు సంపాదన సృష్టిస్తామని చెప్పి ఆ మాటలు నిలబెట్టుకునేందుకు సరైన మార్గాలు ఎంచుకోవాలని పలువురు నేతలు సూచిస్తున్నారు. అలాగే ఎన్నికల ముందు చెత్త పన్ను తొలగిస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చెత్త మీద కూడా పన్నులు వసూలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన ఇంకా వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఏపీలో అప్పులు పెద్ద మొత్తంలో తీసుకురావడం చంద్రబాబు ముందున్న సవాల్ అని చెప్పవచ్చు. మరి జగన్ పాలనను విమర్శించిన చంద్రబాబు కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటారేమో చూడాలి.