ఇప్పటికిప్పుడు వైసీపీకి దూరం కాకపోయినా నిదానంగా కొడాలి నాని ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఈ వార్తలను కొడాలి నాని ఖండిస్తారో లేక ఆ వార్తలకు సంబంధించి ఏదైనా క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా కొడాలి నానికి పేరుంది. వైసీపీ కోసం కష్టపడిన నేతలలో కొడాలి నాని ఒకరు. ఆయన భాష విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా జగన్ మాత్రం కొడాలికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
ఒకవేళ కొడాలి నాని వైసీపీకి గుడ్ బై చెబితే పార్టీకి, జగన్ కు పెద్ద షాక్ తగిలినట్టేనని చెప్పవచ్చు. కొడాలి నాని వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు మాత్రమేననే సంగతి తెలిసిందే. కొడాలి నానికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఆ సమస్యలు రాజకీయాలకు గుడ్ బై చెప్పే స్థాయి సమస్యలు అయితే కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.
కొడాలి నాని వైసీపీకి బలమైన నేతలలో ఒకరని ఆ పార్టీ నేతలు భావిస్తారు. కొడాలి నాని వైసీపీ కోసం ఎంతో కష్టపడి పార్టీకి కీలక సమయాల్లో అండగా నిలిచారు. ఒకవేళ కొడాలి నాని వైసీపీకి నిజంగా రాజీనామా చేస్తే ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. కొడాలి నాని ఈ ఎన్నికల్లో ఓడిపోవడం షాకిచ్చిందని చాలామంది చెబుతారు. కొడాలి నాని జాగ్రత్తగా అడుగులు వేస్తే గుడివాడలో ఆయనకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది.