లోకేశ్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో ఆయన కక్షపూరిత రాజకీయాలకు తెర లేపుతున్నారని పరోక్షంగా రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. రెడ్ బుక్ లో తమ పేర్లు ఉంటే తమ భవిష్యత్తు ఏంటని ఇప్పటికే పలువురు నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే లోకేశ్ రెడ్ బుక్ వెనుక అసలు ప్లాన్ వేరే ఉందని భోగట్టా.
 
వైసీపీ నేతలు చేసిన తప్పులు, అక్రమాలను ఆధారాలు, సాక్ష్యాలతో ప్రూవ్ చేసి చట్టపరంగా శిక్షించడమే లోకేశ్ లక్ష్యమని సమాచారం అందుతోంది. లోకేశ్ చట్టపరంగా ముందుకు వెళ్లడం ద్వారా పార్టీకి కూడా మేలు జరగడంతో పాటు వైసీపీ నేతల తప్పులు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నారా లోకేశ్ కు ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి పదవి వచ్చిందనే సంగతి తెలిసిందే.
 
రాష్ట్రానికి పదుల సంఖ్యలో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావడంలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని వచ్చే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో కంపెనీలు రావడం కోసం నారా లోకేశ్ ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. రెడ్ బుక్ లో తమ పేరు ఉందని తెలిసిన నేతలు ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలను మొదలుపెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
గత ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్లకు ఇబ్బందులు తప్పవని మిగతా వాళ్లకు మాత్రం ఎలాంటి భయం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేయగా మరికొన్ని పథకాలను అమలు చేసే అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం. చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే పింఛన్లను భారీగా పెంచడంతో వృద్ధులు, వితంతువులు ఊహించని స్థాయిలో బెనిఫిట్ పొందుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: