ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ వర్సెస్ రఘురామకృష్ణం రాజు అన్నట్లుగా ఎన్నో ఎపిసోడ్లు కొనసాగాయి. దాదాపుగా ఐదేళ్లపాటు రఘు రామ కృష్ణంరాజు జగన్ పైన ధ్వజమెత్తడం జరిగింది.. అయితే 2024 ఎన్నికలలో రఘురామకృష్ణం రాజుకు టిడిపి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రఘు రామకు వైసిపి మధ్య వార్ గా మారిపోయింది. తాజా గన్నవరం ఎయిర్ పోర్టులో ఇందుకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.


ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న rrr అక్కడ షాక్ తప్పలేదు.. టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పని ఎదురయింది. ఎయిర్ పోర్టులో నుంచి బయటికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న వైసిపి క్యాడర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.. రఘు రామను చూడగానే జై జగన్ అనే నినాదాలతో ఒకసారిగా హోరెత్తించారు. అయితే వాటన్నిటిని పట్టించుకోకుండా రఘురామ ముందుకు సాగిపోయారు.దీంతో వెంటపడి మరి నినాదాలు చేయడం జరిగింది. అనంతరం రఘురామ రోడ్డు మార్గంలో భీమవరానికి బయలుదేరి వెళ్లిపోయారట.


గతంలో వైసిపి నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన rrr జగన్తో వివేదించారు దీంతో వైసిపి సర్కార్ ఆయన్ని పూర్తిగా దూరం పెట్టేసింది.. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపైన సిఐడి కేసు కూడా నమోదు చేయాలని కస్టడీలోకి తీసుకోవాలని.. పోలీసులు కూడా దాడి చేశారు. దీనిపై కోర్టు వరకు వెళ్లగా మెడికల్ కమిటీ నిర్ధారించి ఆ తర్వాత rrr బెయిల్  పై  బయటకు వచ్చారు. ఆయన పైన అనర్హత వేటు కూడా వేయడానికి ప్రయత్నించిన అందులో వైసిపి పార్టీ కాస్త విఫలమయింది.ఇలా ఐదేళ్లు పూర్తి చేసుకున్న రఘురామ టిడిపిలోకి వెళ్లి ఉండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రి ఇచ్చారు .అయినా కూడా వైసిపి టిడిపి మధ్య  ఒక వార్ జరిగేలా చేశారు రఘురామకృష్ణంరాజు. మరి ఈ విషయం పైన rrr ఎలా మాట్లాడుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: