ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ కి వచ్చేందుకు కూడా ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి నుంచి జగనే కోలుకో లేని పరిస్థితి. తాను ఎంతో చేస్తే ఇంత ఘోరమైన రిజల్ట్ ఎలా ? వచ్చిందో అర్థం కాని పరిస్థితి. ఇక వైసీపీ వాళ్లు కూడా ఎందుకు ? ఇంత ఘోరంగా ఓడిపోయాం.. రాష్ట్రం లో మన ఐదేళ్ల పాలన ఇంత ఘోరంగా ఉంది అని స్టన్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ మాజీ వైసీపీ ఎమ్మెల్యే సైతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా వచ్చిందో తెలియట్లేదు... పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం.. గ్రామాల్లోను అదే పరిస్థితి అని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వాపోయారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి కార్యకర్తల సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త పదే పదే అడ్డు తగులుతూ మాట్లాడడంతో ఆయన చేయి చేసుకుని బయటకు పంపేశారు.