తెలంగాణ మంత్రి కొండా సురేఖను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎంతో న‌మ్మారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను కాద‌ని వైసీపీలోకి వెళ్లిన సురేఖ దంప‌తులు అక్క‌డ ఓడిపోయారు. ఆ త‌ర్వాత బీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లి అక్క‌డ నానా కంపు కంపు చేసుకున్నారు. చివ‌ర‌కు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆర్ సురేఖ‌కు సీటు కూడా ఇవ్వ‌లేదు. క‌ట్ చేస్తే ఆ ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రెస్ లోకి వ‌చ్చి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లోనూ సురేఖ తూర్పు నుంచి గ‌ట్టి పోటీలో గెలిచారు. సీనియ‌ర్ నాయ‌కురాలు.. బీసీ , మ‌హిళ కావ‌డంతో రేవంత్ ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే త‌న దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి నమ్మకాన్ని సురేఖ దంప‌తులు కోల్పోయినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి తరపున రాజకీయం అంతా ఇప్పుడు ఆయనే నడుపుతున్నారు. చేరికల వ్యవహారాన్ని కూడా వేం న‌రేంద‌ర్ రెడ్డి మాత్ర‌మే చూస్తున్నారట‌. ఈ క్రమంలో వరంగల్ జిల్లా చేరికల విషయంలో తమ మాటే వినాలని.., తమ వ్యతిరేకుల్ని చేర్చుకోవద్దని .. కొండా మురళి వేం నరేందర్ తో గొడవపడినట్లుగా ప్ర‌చారం న‌డుస్తోంది. అస‌లు కొద్ది నెల‌ల ముందే సురేఖ ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి తో గొడ‌వ ప‌డుతూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో వైర‌ల్ అయిన‌ సంగ‌తి తెలిసిందే.


ఇప్పుడు ముర‌ళీ ఏకంగా వేం న‌రేంద‌ర్ రెడ్డికే వార్నింగులు ఇస్తోన్న వ్య‌వ‌హారం తెలియడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని గౌరవాన్ని పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చార‌ని అంటున్నారు. సీతక్క విషయంలోనూ కొండా దంపతుల బిహేవియ‌ర్ రేవంత్‌కు అస్స‌లు అస్స‌లు న‌చ్చ‌ట్లేద‌ట‌. ఇక సీత‌క్క మ్యాట‌ర్ లోనూ.. తాజాగా ఎమ్మెల్సీ  బ‌స్వ‌రాజు సార‌య్య చేరిక విషయంలోనూ కొండా సురేఖ మాటలు చెల్లలేదు. కొండా దంపతులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడేలా చేయడంతో రేవంత్ అసహనానికి గురైనట్లుగా పార్టీ వ‌ర్గాల టాక్ ? ఇదే ప‌రిస్థితి కొండా దంప‌తులు కంటిన్యూ చేసుకుంటే రేవంత్ ద‌గ్గ‌ర వారి ప్ర‌యార్టీ పూర్తిగా పోవ‌డంతో పాటు సురేఖ ను రెండేళ్ల త‌ర్వాత అయిన కేబినెట్ నుంచి పీకేసినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని పార్టీ నేత‌లే గుస‌గుస లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: