ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణ‌ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆస‌క్తి చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ నేత‌లు మిన‌హా మిగిలిన వారు బ‌య‌ట‌ కనిపించడం లేదు. ఇక మ‌రీ ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రెచ్చి పోయిన నేత‌లు అంద‌రూ ఇప్పుడు సైలెంట్ అయిపోవ‌డ‌మో లేదా రాజ‌కీయంగా చేతు లెత్తేయ‌డ‌మో జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ గా నోటి ఏది వ‌స్తే అది మాట్లాడేసిన మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్‌ను క‌లిసిన ప్పుడు ఓసారి కనిపించి మళ్ళీ పత్తా లేకుండా పోయాడు.


పార్టీ ఘోర ఓట‌మి త‌ర్వాత పేర్ని నాని.. బొత్స లాంటి వాళ్లు మీడియా ముందుకు వ‌స్తున్నా కూడా కొడాలి నాని వారిలా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. హ‌డావిడి చేయ‌డం లేదు. పైగా నానిని వ‌రు స కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే గుడివాడ లో గ‌త వారం రోజులుగా కొడాలి నాని గురించి ఓ ఆస‌క్తి క‌ర చ‌ర్చ న‌డుస్తోంది. కొడాలి నాని కూడా విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని బాటలోనే నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజ‌మా ?  ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌ది ప‌క్క‌న పెడితే నాని కంచుకోట అలా బ‌ద్ద‌లు అయ్యిందో లేదో అక్క‌డే గ‌ట్టిగా న‌డుస్తుండ‌డంతో చాలా మంది రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం దీనిపై ఆరా తీస్తున్నారు.


అస‌లు ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా కొడాలి నాని అనారోగ్య సమస్యల తో బాధ‌ప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగినా నాని దానిని ఖండించారు. ఇప్పుడు పార్టీ ఓట‌మి త‌ర్వాత అనారోగ్యంగా ఆయ‌న ఉన్నార‌ని.. బాగా డ‌ల్ గా ఉంటున్నార‌ని.. నాని లో మునుప‌టి జోష్ లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే టాక్ న‌డుస్తోంది. నాని గుడివాడ కు దూరంగా హైద‌రాబాద్ లోనే కొంత కాలం ఉండాల‌ని కూడా అనుకుంటున్నార‌ట‌. నాని లాంటి వాడే రాజ‌కీయాల‌కు దూరం జ‌రిగితే చాలామంది వైసీపీ నేతలు కొడాలి నాని బాటలోనే పయనించనున్నారు.


ఇప్ప‌టికే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయాల‌కు దూరం జ‌రిగి అస్త్ర స‌న్యాసం చేశారు. ఇప్పుడు కొడాలి నాని కూడా అదే ప‌ని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న వైసీపీ శ్రేణులు డీలా ప‌డ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: