ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది.. కూటమి అధికారంలోకి వచ్చింది. లోకేష్ రెడ్ బుక్‌లో ఒక్కో పేజ్ ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. పేర్లు బయటకు వస్తున్నాయి.. ఐదేళ్లు అరాచకంగా పాలన చేసిన వారి గురించి పోలీసులు ఆరాలు తీస్తున్నారు. రెడ్ బుక్.. అదో చిత్తు బుక్కు అంటూ అప్పుడు అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే రెడ్ బుక్ గురించి కంగారు పడుతున్నారు.. భయ పడుతున్నారు కూడా..!
ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్ తో మొదలు కుని.. ఆ పార్టీ నాయకులందరికీ ఇప్పుడు రెడ్ బుక్ టెన్షన్ అయితే మామూలుగా లేదు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల న్నింటి పైనా కూటమి ప్రభుత్వం లెక్కలు తేల్చే పని మొదలు అవుతోంది. రెడ్ బుక్ ఎఫెక్ట్ లో భాగంగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మొదటి బోణి కొట్టారు. ఆ తరువాత లిస్ట్ లో మరిన్ని వైసీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని సోషల్ మీడియాలో గట్టి గా ప్రచారం జరుగుతుంది.
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదవ్వడం అరెస్టు అవ్వడం.. అలాగే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేష్ మీద, టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి పేర్లు బయటకు రావడం.. ఇక కాకినాడలో వైసీపీ మాజీఎమ్మెల్యే ద్వారంపూడి పై కేసు నమోదు ... అలాగే ఎర్ర చందనం అక్రమ రవాణా వెనుక ఉన్న వైసీపీ ముఖ్య నాయకులకు ఉచ్చు బిగిస్తుండడంతో వైసీపీ నేతల టెన్షన్ మామూలుగా లేదు.