సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను భారత దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకొనున్నారు. అయితే వినాయక చతుర్థికి ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండగ సంబరాలను ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.వినాయక చతుర్థి పర్వదినాన మట్టి వినాయకుడినే పూజించాలన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని మట్టి గణపతిని ఉపయోగించే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందని ఈ సందర్భంగా చెప్పారు. వీలైనంత త్వరగా ప్రజలకు పర్యావరణాన్ని గురించి అవగాహన కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో ప్రతి మండపంలో కూడా మట్టి వినాయకుడి విగ్రహాలే కనిపించాలని, మట్టి గణనాథుడికే పూజలు జరిపేలా ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.

"వేడుకలు, పండుగలకు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.  ఉదాహరణకు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేలా ప్రజలను ప్రోత్సహించాలి. దేవాలయాల్లో బటర్ పేపర్ కవర్లలో ప్రసాదం పెట్టడం సరికాదు. బదులుగా, ప్రసాదం పంపిణీకి తాటి బుట్టలు, ఆకులు ఉపయోగించాలి. ఈ ప్రయోగాన్ని పిఠాపురం దేవాలయాలతో ప్రారంభించాల"ని పవన్ కళ్యాణ్ సూచించారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంపైనా, అధికారులపైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పవన్‌ తమ పార్టీ సభ్యులను హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని పట్టుకోవాలని ఈ అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో ఉందని కాబట్టి శాలరీ తీసుకోని అనుకోడా చెప్పే తన గొప్ప మనసును చాటుకున్నారు. "అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకుగాను 31000 వస్తాయి, సంతకాలు పెట్టాల"ని కొంతమంది అధికారులు అడిగితే దానికి కూడా తిరస్కరించారు. ఫర్నిచర్ కూడా కొనవద్దని చెప్పారు. తాను ఇలా సేవ్ చేయడం వల్ల అవి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల రూపంలో ఇవ్వవచ్చని చెప్పారు. ఇప్పటిదాకా ఇలాంటి రాజకీయ నేతను తాము ఎప్పుడూ చూడలేదని ఏపీ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: