ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇదే తరుణంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ నుంచి చాలామంది కీలక నేతలు ఈ పార్టీలో చేరాలని ట్రై చేస్తున్నారు. బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక లీడర్లు అంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంత మందైనా రండంటూ గేట్లు తెరిచిపెట్టాడు. ఇలా వలసల పర్వం కొనసాగుతున్న తరుణంలో,  కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి నుంచి కూడా ఒక కీలక లీడర్, కాంగ్రెస్ వైపు రావాలని చూస్తున్నారట.ఆ లీడర్ ఎవరు? ఆయన ఎందుకు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారు అనే వివరాలు చూద్దాం.

 అదిలాబాదులో బిజెపి పార్టీలో కీలకంగా ఎదిగినటువంటి మాజీ ఎంపీ సోయం బాబురావు బిజెపి పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. తను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని కానీ, ఇప్పుడు పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీసం పార్లమెంటు సీటు కూడా దక్కలేదని తీవ్రమైన అసహనానికి లోనయ్యారట. దీంతో ఆయన బిజెపి పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉండి అవమానాలు భరించే కన్నా, తను నమ్ముకున్న కార్యకర్తలు అనుచరులు అంతా కలిసి ప్రత్యాన్మయం చూసుకోవడం బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. జిల్లాలోని కొందరు నేతలు ఒక ఎమ్మెల్యే స్వలాభం కోసం నన్ను బలి పశువులా చేశారని సోయం రగిలిపోతున్నారట.

 నేను ఎంపీగా ఉన్నప్పుడు నా వెనకే ఉన్నటువంటి నాయకులంతా టైం చూసి నాకు వెన్నుపోటు పొడిచారని, ఆయన ఎంతో బాధపడుతున్నారట. ఈ విధంగా  2019లో బిజెపిలో చేరి అద్భుత మెజారిటీతో గెలుపొందారు. అలా జిల్లా వ్యాప్తంగా బిజెపి పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారట. 2024  పార్లమెంటు ఎలక్షన్స్ లో ఆ సీటును సోయం బాబురావుకి ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేష్ కు ఇచ్చింది. ఇక అప్పటినుంచి బిజెపిపై గుర్రు మీద ఉన్నటువంటి బాపూరావు పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ లో చేరాలనే ప్రయత్నం చేస్తున్నారట. మరి చూడాలి ఆయన ప్రయత్నం పలిస్తుందా? లేదంటే బీజేపీ బుజ్జగిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: