* కెసిఆర్ ఓటమికి అస్సలు కారణం అదేనా..?

* సంక్షేమం వర్షం కురిపించిన రాలని ఓట్లు

* కెసిఆర్, జగన్ అతి నమ్మకమే ఈ పరిస్థితి రావడానికి కారణమా..?

తెలంగాణ ఉద్యమంలో జోరుగా పాల్గొని ఏకంగా తెలంగాణ సాధనకై బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసారు.రాష్ట్రమంత బంద్ లు నిరసనలతో హోరేత్తిపోయింది. దీనితో పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని అప్పటి కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. 2014 జూన్ 2 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీనితో అక్కడి నుంచో కెసిఆర్ కి తిరుగులేకుండా పోయింది.. 2014 లో తెలంగాణ లో జరిగిన ఎన్నికలలో గెలిచి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు..తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడదం పైగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది.సీఎం గా భాద్యతలు చెప్పట్టిన కెసిఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువ చేసారు. దీనితో 2018 ఎన్నికలలో కూడా కెసిఆర్ అద్భుత విజయం సాధించారు. అయితే గత ఐదేళ్లలో ప్రతిపక్షాలు పుంజుకున్నాయి..


ఇదిలా ఉంటే కెసిఆర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటి వరకు రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టిగా రెండో స్థానంలో వున్నా బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. ఉన్నట్టుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వూపందుకుంది.గత 10 ఏళ్లలో కెసిఆర్ పాలనకు విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ఈ సారి కెసిఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లపై ఎంత వ్యతిరేకత వున్న వారిని మార్చకపోవడంతో 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయింది. ఈ సారి కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది.అలాగే కెసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే లను మార్చక గెలవలేకపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఘోరంగా ఓడిపోయారు. అయితే తమకి ప్రజలలో తీవ్రమైన అభిమానం వుంది.తమని చూసి ప్రజలు ఓటు వేస్తారని వారు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇటు కెసిఆర్, అటు జగన్ ఘోరంగా ఓడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: