ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాజకీయాలు ఒకింత ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఒకింత తక్కువేనని ఇక్కడి ఓటర్లు భావిస్తారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ పార్టీపార్టీ అనే తేడాల్లేకుండా ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీనే గెలిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో టీ.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
 
అయితే 2028లో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. రేవంత్ రెడ్డి తాజాగా ఒక సందర్భంలో స్పందిస్తూ తెలంగాణలో పదేళ్లకు ఒకసారి అధికారం మారుతుందని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు నిజమైతే 2028 సంవత్సరంలో కూడా తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయ్యారంటే ఆ విజయం అంత సులువుగా దక్కిన విజయం అయితే కాదు. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆగష్టు నెలలో రుణమాఫీ అమలు చేస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకుంటే మాత్రం పొలిటికల్ గా రేవంత్ రెడ్డికి తిరుగుండదని చెప్పవచ్చు.
 
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు ప్రజల నుంచి అద్భుతంగా స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రజలు సైతం రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని చెబుతుండటం గమనార్హం. దేశంలోని బెస్ట్ సీఎంలలో రేవంత్ రెడ్డి ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అంచెలంచెలుగా ఎదిగిన నేత కావడంతో ప్రజల కష్టాల గురించి కూడా రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. పరిమిత సంఖ్యలో పథకాలను అమలు చేస్తున్నా ప్రజలకు మేలు చేసే పథకాలను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: