•కాలేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం


•నిరుద్యోగుల ఆకలిని తీర్చలేక పోయారు

•కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత..


(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - ఇండియా హెరాల్డ్)


తెలంగాణ రాష్ట్ర జాతిపితగా పేరు సొంతం చేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ అలియాస్ కేసీఆర్ దాదాపు 6 దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర సాధన కలను సహకారం చేశారు.. మొండి సంకల్పంతో తెలంగాణను సాధించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి.. తెలంగాణ ప్రజల్లో హీరో గా నిలిచి.. చెరగని ముద్ర వేసుకున్నారు.. దాదాపు రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ఈసారి కూడా హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసాం కదా కృతజ్ఞత ప్రజల్లో ఉంటుంది . మళ్లీ మనల్ని ముఖ్యమంత్రిని చేస్తారు అనీ ధీమా వ్యక్తం చేయగా.. ఊహించని విధంగా ఘోర పరాభవానికి గురయ్యారు కెసిఆర్.  


హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆశలపై రేవంత్ రెడ్డి రూపంలో ప్రజలు తిప్పి కొట్టారు. ఎంతలా అంటే కనీసం ఒక్క ఎంపీ సీట్  కూడా గెలవకపోవడం ఇంతకంటే ఘోర పరాభవాన్ని మరెక్కడా చూడలేదని చెప్పవచ్చు.. కనీసం 40  స్థానాలులో కూడా కేసీఆర్ గెలవలేకపోయారు.. ముఖ్యంగా దీనికి కారణం 2023 అసెంబ్లీ ఎన్నికలను సీరియస్గా తీసుకోకపోవడం అని.. ఎలాగైనా గెలుస్తాములే అని మొండి ధైర్యంతోనే ఎలక్షన్లను నిర్లక్ష్యం చేశారు.. ఫలితంగా ఘోరమైన పరాజయాన్ని చూశారు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు..


అంతేకాదు కేసీఆర్ ఈసారి ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పాలి. పైగా ఎవరి మాటలు వినరు అనే విమర్శలు పెరుగుతున్న నేపద్యంలో రేవంత్ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళింది .. మోడీ గురించి రాష్ట్ర బిజెపి నాయకుల గురించి మాట్లాడకుండా.. ఆయన ఫోకస్ అంతా బీఆర్ఎస్ కేసీఆర్ మీదే పెట్టారు.

తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఉద్యోగాలు రాక ఆగ్రహంతో ఉన్న యువతరానికి కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా చూపడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. పైగా జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 12 రోజుల పాటు పర్యటించడం ప్రధానంగా గ్రామీణ ఓటర్ల పై సానుకూల ప్రభావం చూపించింది. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ కాలేశ్వరం కెసిఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనే ప్రచారం కూడా కేసీఆర్ కుటుంబానికి మాయని మచ్చగా మిగిలిందని చెప్పాలి . అంతేకాదు మేడిగడ్డ బరాజు పిల్లర్లు కుంగిపోయాయి అన్న వార్త బయటకు రాగానే రేవంత్ రెడ్డి ప్రచారాలకు మరింత బలం పెరిగింది. ఎక్కడ కూడా నాణ్యమైన పనితనం కనిపించడం లేదు అని.. మరొకవైపు కుటుంబ సభ్యులనే అందర్నీ ఉన్నత పదవుల్లో నియమించడం అన్నీ కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారాయి.. కెసిఆర్ గుడ్డి నమ్మకం తీవ్రంగా ఓటమిపాలయ్యేలా చేసింది.. ఇవన్నీ ఆయనను ఈసారి ఎన్నికలలో ఘోరంగా ఓడించాయని చెప్పవచ్చు.. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి హీరో అయిన కేసీఆర్ ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే జీరో అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: