* Brslp విలీనమే రేవంత్ లక్ష్యం
*కేసీఆర్ ఎత్తులకు రేవంత్ పైఎత్తులు
* త్వరలోనే బీఆర్‌ఎస్ ఖాళీ ?
తెలంగాణ రాష్ట్రంలో.. వలసల రాజకీయాలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీని వరుసగా నేతలందరూ... వీడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏడు మంది తెరాస ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ గూటికి చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా... కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తం 39 ఎమ్మెల్యేలు గెలిచిన గులాబీ పార్టీ... చేరికల దెబ్బకు 31 కి చేరుకుంది. మరో 19 మంది ఎమ్మెల్యేలు... గులాబీ పార్టీని వీడితే... బీఆర్ఎస్ LP కాంగ్రెస్ లో విలీనం కావడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Brslp విలీనం కావాలి అంటే....విలీనం అవ్వాలి అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరాలి. ఇప్పటి వరకు చేరింది 7 మంది ఎమ్మెల్యే లు. కాబట్టి ఇంకో 19 మంది mla లు చేరితే brslp విలీనంకు అర్హతసాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ మిగతా 19 మంది ఎమ్మెల్యేలను... గులాబీ పార్టీ నుంచి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న దాదాపు 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారట. మరో నెల రోజుల్లోపు 19 మంది ఎమ్మెల్యేల టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి చేరుతారని తెలుస్తోంది.
వాస్తవానికి గతంలో కూడా... కాంగ్రెస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ... గులాబీ పార్టీలో చేర్చుకొని... కాంగ్రెస్ పార్టీ LP ని కూడా విలీనం చేసుకున్నారు. దాంతో అప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలారు. ఇక ఇప్పుడు... రేవంత్ రెడ్డి కూడా అదే రివేంజ్ను కెసిఆర్ పై తీర్చుకుంటున్నారు. గులాబీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయ్యేవరకు... రేవంత్ రెడ్డి నిద్ర పోయేలా లేదు.