* హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కలిసి పని చేసేలా ప్లాన్
* కేసీఆర్ సై అయిపోవాలి
* ఉద్యమకారులకు ప్రాధాన్యత
* 2028 లక్ష్యంగా పార్టీ పునర్ణిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో... గులాబి పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటోంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...తెలంగాణ తీసుకువచ్చిన గులాబీ పార్టీని... దారుణంగా ఓడించారు ప్రజలు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న... గులాబీ పార్టీని ఊడ్చేశారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితమైన గులాబీ పార్టీ... పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకే... ఆగిపోయింది.
ఇప్పటివరకు కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి. ఇక వెనుక ఉండి పార్టీని నడిపించాల్సి ఉంది కేసీఆర్. హరీష్ రావు అలాగే కేటీఆర్ లకు ఇద్దరికీ.. గులాబీ పార్టీని అప్పగించి కెసిఆర్ వెనుక ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి. అలా అయితేనే గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తారా ? లేదా అనేది చూడాలి.