ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి... ప్రజలే లక్ష్యంగా పనిచేస్తోంది. దాదాపు రోజుకు 18 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేయాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి... ఎన్నికల కంటే ముందు కూటమి పార్టీలు ప్రకటించిన హామీలు.. ఇతర విషయాలు అమలు పరచాలంటే కచ్చితంగా ఏపీ ప్రభుత్వ పెద్దలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో.. వైసీపీ పాలనలో తమను ఇబ్బంది పెట్టిన వారిని కూడా... చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారట.

చాలామంది వైసిపి నేతలపై కేసులు పెడుతున్నారట. ఇటు విగ్రహాలను కూడా ధ్వంసం చేసే... పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పనితీరును.. ఏబీఎన్ రాధాకృష్ణ ప్రశ్నించారు. వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో.... చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను...  డైరెక్ట్ గానే ప్రశ్నించారు. అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగానే..చంద్రబాబు పాలిస్తే.. అసలు కుదరదు అంటూ.. రాధాకృష్ణ పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి లాగా... కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు చేస్తుంటే.... ఆయనపై తెలుగు తమ్ముళ్లే ట్రోలింగ్ చేస్తున్నారని ఏబీఎన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. అంతేకాకుండా నారా లోకేష్  రెడ్ బుక్ పరువు కూడా తీశారు రాధాకృష్ణ. అసలు ఆ పుస్తకం దేనికి పనికి రాదని... మొదట పాలనపై దృష్టి పెట్టాలని.... సెటైరికల్  గా చురకలాంటించారు. రామోజీ రావు కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చంద్రబాబు చేయడాన్ని కూడా ఆర్కే వ్యతిరేకించారు.  అయితే.. చంద్రబాబు ప్రభుత్వం పై.. ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలను.... ప్రొఫెసర్ నాగేశ్వరరావు కోడ్ చేస్తూ... ఆయన కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వాన్ని... తనలాంటివారు  ఎవరైనా ప్రశ్నిస్తే.... సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారని... జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాడని... అంటారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు.... తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ఏబీఎన్ రాధాకృష్ణ... కరోనా వైరస్ కంటే డేంజర్ గా వ్యవహరిస్తున్నారని... ఇప్పుడు రాధాకృష్ణపై  టిడిపి సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తుందా ? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా... జగన్మోహన్ రెడ్డి కి రాధాకృష్ణ అమ్ముడుపోయాడా ? అని టిడిపి అనగలుగుతుందా ? అంత సాహసం చేస్తుందా అని  ప్రొఫెసర్ నాగేశ్వరరావు చురకలు అంటించారు. మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: