బీజేపీని రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉన్న నేత బీజేపీకి అవసరమని అలాంటి నాయకునికి పార్టీలోని ఇతర నాయకులు సైతం మద్దతు ఇస్తే పరిస్థితులు మారతాయి. గతేడాది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో బీజేపీకి కూడా విజయావకాశాలు అదే స్థాయిలో ఉన్నాయి. అయితే బీజేపీ చేసిన తప్పులు ఆ పార్టీని ముంచేశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాబోయే రోజుల్లో అయినా కలిసికట్టుగా పని చేస్తామనే నమ్మకాన్ని కలిగించడంలో బీజేపీ పూర్తిస్థాయిలో సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. బీజేపీ నేతలు మరింత కష్టపడితే రాష్ట్రంలో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీకి సరైన మేనిఫెస్టో కూడా అవసరం అని చెప్పవచ్చు. కేంద్రం మేనిఫెస్టోతో సంబంధం లేకుండా రాష్ట్రం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను అమలు చేస్తే మంచిది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మంచి పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను బీజేపీ ప్రకటించే దిశగా అడుగులు వేస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా మేనిఫెస్టో కారణమనే సంగతి తెలిసిందే. మరి బీజేపీ నేతలు తమ వ్యూహాలను మార్చుకుంటే పరిస్థితులు మారతాయి. తెలంగాణ విషయంలో మోదీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇతర పార్టీల పాలనను చూసిన ప్రజలు రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా చూడాలని భావిస్తున్నారు.