2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా అనూహ్యమైన ఫలితాలకు కారణమయ్యారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించి కనుమరుగవుతుందనుకున్న కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇలా తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత జరుగుతున్న పరిణామాలు అన్ని గులాబీ దళపతి కేసీఆర్ భవితవ్యం ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదిలేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని దక్కించికున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది.


 చివరికి రానున్న రోజుల్లో ఆ పార్టీ ఉంటుందా లేకపోతే పతనం అయిపోతుందా అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయ్. అయితే ఇలా తిరుగులేని పార్టీగా ఉన్న బిఆర్ఎస్ కు ఏకంగా పతనం అయ్యే స్థాయికి ఎందుకు పడిపోయింది అనే చర్చ కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్నాయి  అయితే గులాబీ దళపతి కేసీఆర్ మొండి వైఖరి చివరికి పార్టీని నిండా ముంచేసింది అన్నది తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టి.. కీలక నేతలుగా కొనసాగిన వారిని.. కెసిఆర్ బయటకు పంపడమే చివరికి ఆ పార్టీని కొంప ముంచేస్తుందని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు  మరీ ముఖ్యంగా హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కెసిఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టడంతోనే ఆ పార్టీ పతనం మొదలైంది అంటూ అభిప్రాయపడుతున్నారు.



 బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టడంలో అటు కెసిఆర్ పాత్ర ఎంత ఉందో కాస్త తక్కువైనా అటు ఈటల పాత్ర కూడా అంతే ఉంది  అయితే ఇక ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన పదవి ఉన్నా లేకపోయినా ఈటెల బిఆర్ఎస్ను వదలలేదు. అలాంటి ఈటలను ఇబ్బందులకు గురిచేసి చివరికి కెసిఆర్ పొమ్మనలేక పోకబెట్టేశారు. దీంతో విషయం అర్థం చేసుకున్న ఈటెల బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు.


రాజు ఎక్కడున్నా రాజే అన్న విధంగా బిజెపిలోను తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగించారు. గతంలో బై ఎలక్షన్స్ లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా కూడా గెలిచారు. ఇలా బిఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన ఈటెల రాజకీయ ప్రస్తానానికి ఎలాంటి దెబ్బ పడకపోయినప్పటికీ.. ఈటెల బయటికి వెళ్లడం మాత్రం కేసిఆర్ పార్టీకి పెద్ద దెబ్బ పడింది. కెసిఆర్ అందరిని వాడుకుని వదిలేస్తారని.. ఈటెల లాంటి నాయకుడిని ఇలా చేయడం ఏంటి అని ఎంతోమంది అనుకున్నారు. ఇక అటు దీనికి తోడు కేసీఆర్ ఇచ్చి మరిచిన హామీలు.. ప్రతిపక్షం లేకుండా చేయాలనే స్వార్థం.. కెసిఆర్ మొండి వైఖరి అన్ని ప్రజల్లో వ్యతిరేకత తెచ్చి విపక్షంలోకి తీసుకువచ్చాయని.  ఇక ఇప్పుడు పార్టీ పతనమయ్యే పరిస్థితికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kc4