రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటే తెలంగాణ డిమాండ్లను కూడా చంద్రబాబు అంగీకరించినట్లేనా అంటూ తెలియజేశారు.. చంద్రబాబు మాటలు వింటుంటే ఏపీకి ద్రోహం చేసేలా కనిపిస్తున్నారనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యల పైన ఇద్దరు సీఎంలు ఎదిరించి చర్చించలేరని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే ఏపీలోని పోర్టులో తెలంగాణ వాట కూడా అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు టిడిపి బోర్డ్ ఆదాయంలో కూడా తెలంగాణకు వాటా కావాలని అడిగినట్లుగా తెలిపారు.
తెలంగాణకు వాట ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమే అయినప్పటికీ.. పార్టీపరంగా చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి కావచ్చు.. కానీ ఏపీ ప్రభుత్వం పరంగా చంద్రబాబు వైఖరి అంటో చెప్పాలి అంటు వైసిపి నేత అంబాటి రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర కి తీవ్ర అన్యాయం జరిగిందని విభజన జరిగిన ఇప్పటికీ పదేళ్లు కావస్తున్న హైదరాబాదు ఉమ్మడి రాజధాని గానే ఉందని కానీ దాని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చేశారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారంటూ తెలియజేయడం జరిగింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల దృష్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది ముఖ్యంగా పింఛన్ పెంపు వ్యవహారాన్ని కూడా ఒకటవ తేదీకి ఇచ్చేశారు. అలాగే రైతు భరోసా మహిళలకు 1500 రూపాయలు.. ఉచిత ఇసక అనే పథకాలను కూడా అమలు చేశారు.