దీంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... కూతురి విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 115 రోజులుగా... ఢిల్లీలో ఉన్న తీహార్ జైల్లో జైలు జీవితం అనుభవిస్తున్నారు కల్వకుంట్ల కవిత. తిహార్ జైల్లో ఉన్న... కల్వకుంట్ల కవితను సిబిఐ కేసులు కూడా వేధిస్తున్నాయి.
ఇక ఈ 115 రోజులుగా... బెయిల్ కోసం కల్పకుంట్ల కవిత చేయని ప్రయత్నం లేదు. అయితే ఎక్కడా కూడా బెయిల్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కోసం గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిఫాల్ట్ బెయిల్ కోసం... గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తూ అందట. ఈ బెయిల్ ప్రకారం కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె న్యాయవాదులు కూడా చెబుతున్నారు. ఒక నిందతుడి నేరాన్ని బట్టి కస్టడీ.. గడువు అప్పుడప్పుడు గరిష్టంగా ఉంటుంది. ఆ కస్టడీ ముగిసిన కూడా బెయిల్ రాకపోతే మనం డిఫాల్ట్ బెయిల్.. కోసం కోర్టును ఆశ్రయించవచ్చు.