ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓటమి పైన తాజాగా మాజీమంత్రి కేటీఆర్ మొదటిసారి మాట్లాడడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ హరీష్ రావులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమి పైన పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ప్రజలకు అన్ని మంచి పథకాలు పెట్టిన జగన్ ఓటమి తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఓడిపోయిన వైసీపీ పార్టీకి 40 శాతం రావడం మరింత ఆశ్చర్యానికి కలిగించిందని కూడా తెలియజేశారు. ఇలా సాధించడం అనేది కూడా మామూలు విషయం కాదని కూడా తెలిపారు.


పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరొక లాగా ఉండేవని.. ఇదంతా ఒక ఎత్తు అయితే  ప్రతిరోజు ప్రజలలో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం ఏమిటా అంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాదు జగన్ ఓడించాలన్న వ్యూహం తోనే షర్మిలను ఒక పావుగా అక్కడ అందరూ  వాడుకున్నారని ఆమె వల్ల ఏమీ కాదంటూ వెల్లడించారు.. ఆమె వల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదని జగన్ హీరో షర్మిల జీరో అన్నట్లుగా కేటీఆర్ కామెంట్స్ చేశారు.


ఇది తెలంగాణలో ఓటమి పైన కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలది తప్పు అనడం కూడా మాదే తప్పని ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే ఫలితాల తర్వాత అది అర్థమయింది అంటూ కూడా కేటీఆర్ తెలిపారు.ఇక తెలంగాణలో ఓటమి ఫిరాయింపుల పైన హరీష్ రావు కూడా స్పందిస్తూ.. గతంలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నామని ఓడిపోయారని ఇప్పుడు కాంగ్రెస్కు అదే వర్తిస్తుంది అంటూ కూడా తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా వైసీపీ ఓటమి తర్వాత మొదటిసారి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ విజయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: