జులై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలను గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అతిథిగా వచ్చారు. అంతేకాదు ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. వైఎస్ఆర్ బతికున్నట్లయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయేది కాదని అన్నారు. కమ్యూనిస్టులు అంటే వైఎస్‌కు చాలా ఇష్టమని వారిపై ఆయనకు ఎంతో గౌరవం అభిప్రాయం ఉండేదని నారాయణ చెప్పుకొచ్చారు. ఈ విషయాలను వైఎస్ఆర్ నిరూపించుకున్నట్లు కూడా తెలియజేశారు.

 వైయస్సార్ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్న పలకరిస్తారని తెలిపారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆ వ్యక్తిని ప్రకటించడానికి ఎవరు ఆసక్తి చూపరని వైఎస్ఆర్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని అన్నారు. వైఎస్ఆర్ చిన్నా పెద్దా, పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించగల మంచి మనసున్న మహానేత అని పొగిడారు.

వైఎస్సార్‌ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. తెలంగాణ ఏర్పడినా.. టీఆర్‌ఎస్‌ పార్టీ అనేది ఉనికి లోకి వచ్చి ఉండేది కాదని కూడా ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. రాజకీయాల్లో వైఎస్సార్‌ లాంటి గొప్ప పొలిటిషియన్ మరొకరు ఉండరని కూడా నారాయణ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఆయనొక విలక్షణ వ్యక్తి అని ప్రశంసించారు. ఎంతో మంచి చేశారు కాబట్టి ప్రజలు ఇప్పటికీ ఆయన గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ అనేక ఇబ్బందులు ఫేస్ చేశారని ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్షల్ గా మారాయి.సీఎం అయ్యాక కూడా వైఎస్సార్‌ ని ఇబ్బంది పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సొంత పార్టీ వ్యక్తులు, బయటి పార్టీల వ్యక్తులు చాలా కష్టాలు పెట్టారని అన్నారు. ఆ కష్టాలన్నింటిని వైఎస్సార్‌ ఎదుర్కొన్నారని, రాజకీయాల్లో జెమ్‌ పర్సనాలిటీ అని ప్రశంసించారు.

 అయితే ఈ మొత్తం ప్రసంగంలో ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపైన చేసిన వ్యాఖ్యలు మరింత హైలెట్ అయ్యాయి. షర్మిలమ్మ తన తండ్రి ఫేస్ చేసిన కష్టాల్లో ఇంకా కొన్ని కూడా చూసి ఉండరు అని చెప్పుకొచ్చారు. "ఒకవేళ షర్మిలకు కష్టాలు వస్తే.. అవి కాంగ్రెస్ పార్టీ నుండే వస్తాయి.. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’" అని నారాయణ సలహా ఇచ్చారు. ఏపీలో, కేంద్రంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పై పోరాటం చేయాలంటే చాలా బలంగా ఉండాలని సూచించారు. ఏపీకి ప్రస్తుత సీఎం చంద్రబాబు వల్లే చాలా నష్టాలు జరుగుతోందని కూడా ఆయన కామెంట్స్ చేశారు. బీజేపీ కూడా చాలా ప్రమాదకరమైన పార్టీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: