2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. దానితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 వ సంవత్సరం తర్వాత రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వస్తే, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019 వ సంవత్సరం వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే, తెలంగాణ లో మాత్రం టీఆర్ఎస్ పార్టీనే రెండవ సారి కూడా అధికారంలోకి వచ్చింది. ఇక 2014 వ సంవత్సరంలో చంద్రబాబు అధికారంలో ఉండడంతో కేసీఆర్ కూడా ఆయనతో పెద్దగా సఖ్యతతో లేడు.

ఇక 2019 వ సంవత్సరం జగన్ సీఎం కావడంతో ఆయనతో మంచి సంబంధాలను పెట్టుకున్నాడు. ఇకపోతే 2023 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. ఇక కాంగ్రెస్ పార్టీ భారీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీకి కూడా గట్టి ఎదురు దెబ్బ తాకింది. టిడిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పరిస్థితి ఒకేలాగే ఉంది. ఎందుకు అంటే కెసిఆర్ 2023 లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం బిజెపి ఈ పార్టీకి పెద్ద జలక్ ఇచ్చేలా కనబడుతుంది.

నెక్స్ట్ ఎలక్షన్లలో కెల్లా ఈ పార్టీ రెండవ స్థానంలోకి వచ్చి బిఆర్ఎస్ ను మూడవ స్థానంలోకి నెట్టేసి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇకపోతే ఆంధ్రా విషయానికి వస్తే ఈ సారి తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో వైసీపీ రెండవ స్థానంలో ఉంది. ఇక జనసేన ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికలలో జనసేన సంతగా పోటీ చేస్తే రెండవ స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానితో తెలంగాణలో మాదిరిగానే జగన్ కూడా ఇక్కడ మూడవ స్థానం కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి, ఆంధ్రాలో జగన్ పరిస్థితి దాదాపు ఒకేలా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: