- కన్నీరు పెడుతున్న కేసీఆర్ విజయమ్మ..
- కొడుకుల భవిష్యత్తు కళ్ళముందే పాయే..
- ఆడబిడ్డల భవిష్యత్తు అంధకారమాయే..


రాజకీయాలు అంటేనే సముద్రంలో అలల లాంటిది. అలలు పడుతూ లేస్తూ ఉంటాయి. రాజకీయాల్లో కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఓడిపోతామో ఎప్పుడు గెలుస్తామో తెలియదు. పూర్వకాలంలో అయితే ఒక పార్టీ గెలుస్తుందని ఎన్నికలకు ముందే చెప్పేవారు.  కానీ ప్రస్తుత కాలంలో ఓటర్లు మారిపోయారు. అన్ని రకాలుగా ఆలోచించి వారు ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తున్నారు. ఆ విధంగానే ఏపీలో తెలంగాణలో  రెండు అధికార పార్టీలు గద్దె దిగిపోయాయి. ఇటు తెలంగాణ విషయానికి వస్తే.. కేసీఆర్ ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చి ఎంతో మేలు చేశారు. అయినా ఓడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇచ్చిన హామీలలో 90% నెరవేర్చారు. అయినా ప్రజలు ఓడగొట్టారు. 


వీళ్ళు ఇంతలా ఓడిపోవడానికి ప్రధాన కారకులు  వారి సొంత కుటుంబాలే..మరో కారణం వీరి యొక్క అహంకార భావం.. దీనివల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, వైస్సార్సీపీ అధికారం కోల్పోవలసి వచ్చింది. వీరి అధికారం కోల్పోతే  ప్రధానంగా బాధపడేది  తల్లిదండ్రులే. బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల కేసీఆర్ తన కొడుకు భవిష్యత్తు ఆగమైపోయిందని ఎంతో బాధపడుతున్నారట. ఈసారి ఆయన్ని సీఎం చేద్దామనుకున్న కళ మిస్ అయిపోయింది. ఇక ఏపీలో  జగన్ ఓడిపోయాడని వైయస్ విజయమ్మ కూడా కుమిలిపోతుందట. ఇలా బిడ్డల బతుకులు కళ్ళముందే ఆగమవుతుంటే తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు.

 అహంకార భావమే ఓడించింది:
 ఇక కేసీఆర్  బయటకి పెద్దగా బాధపడినట్టు కనిపించకపోయినా, తన కొడుకు భవిష్యత్తు సెట్ చేయకముందే  పార్టీ ఓడిపోయిందని విపరీతంగా లోలోపల బాధపడుతున్నారట. ఈసారి గెలిస్తే కొడుకుని ముఖ్యమంత్రి చేద్దామనుకున్నారు. కానీ ఆయన అహంకార భావం వల్ల  పార్టీ ఓడిపోయింది. ఇక మరోవైపు  విజయమ్మ తన కొడుకు మరోసారి సీఎం అయితే అన్ని సర్దుకుంటాయి అనుకుంది. కానీ అనూహ్యంగా కూతురు చేసినటువంటి పనికి  కొడుకు ఓడిపోయాడు. దీంతో అటు కూతురునన లేక ఇటు కొడుకును ఏమనలేక  ఇద్దరి మధ్యలో నలిగిపోతోంది.  చివరికి ఎన్నికల సమయంలో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఎవరికి సపోర్ట్ చేయలేక పరాయి దేశం వెళ్ళిపోయింది. ఈ విధంగా బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆవేదన  మామూలుగా లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనాప్పటికీ కుటుంబం కలిసికట్టుగా ఉంటేనే దేన్నైనా సాధించవచ్చు.  ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు గుర్తు చేసుకుంటే మంచిదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: