- కుటుంబ పాలన అంతం..
- ఇంకా తగ్గని చెల్లెళ్ల పంతం..
- షర్మిల కవితక్కలకు అన్నలపై ప్రేమేప్పుడో.?

 
కుటుంబంలో అందరూ రాజకీయాల్లోకి వస్తే తప్పక ఇబ్బందులు వస్తాయనేది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇలా ఇంట్లో ఉన్న వారంతా రాజకీయంగా ఎదిగారు. అదేవిధంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి జగన్,షర్మిల,అవినాష్ రెడ్డి,సునీత రాజకీయంగా ఎదిగారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోయి అహంకార భావం పెరిగిపోయింది. దీంతో ఆస్తులు అంతస్తులు. చివరికి పంపకాల విషయానికి వచ్చేసరికి గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలే రాజకీయాలను విచ్చిన్నం చేశాయని చెప్పవచ్చు. అలా జగన్ మోహన్ రెడ్డి ఈసారి రెండోసారి సీఎం అయ్యే హోదాను మిస్ అయిపోయారు. తెలంగాణలో రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడవసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ ని సీఎం చేద్దామనుకున్నారు. కానీ కుటుంబాలలో చెల్లెమ్మల వల్ల వచ్చిన సమస్యల ఇద్దరు అన్నయ్యలు సీఎం పదవులను కోల్పోయారని చెప్పవచ్చు. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 అన్నయ్యలను ఓడించిన చెల్లెమ్మలు:
సాధారణంగా ఏ ఆడపిల్ల అయినా అన్నయ్యల మేలు కోరుతుంది. కానీ రాజకీయంగా అన్నా,చెల్లి, తల్లి,తండ్రి అనే భావాలు ఉండవనేది ఈ కుటుంబాలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతటి అపజయానికి ప్రధాన కారకురాలు వైఎస్ షర్మిల అని చెప్పవచ్చు. సొంత చెల్లె అన్నపై తిరుగుబాటు చేసింది. చివరికి సీఎం పదవి దక్కకుండా చేసిందని చెప్పవచ్చు.  మరి షర్మిల ఇంత పని చేయడానికి ప్రధాన కారణం ఆస్తుల పంపకం.  ఆస్తుల్లో వచ్చిన గొడవ రాజకీయాల వరకు ఎంట్రీ ఇచ్చి డిసైడ్ చేశాయి.


ఇక తెలంగాణ విషయానికొస్తే  ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వస్తామనుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి కవిత లిక్కర్ స్కాం వ్యవహారం దెబ్బకొట్టింది. ఇది ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతీసింది. ఈసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతామనుకున్నారట. కానీ చెల్లెమ్మ వల్ల సీఎం పదవి పోవడమే కాకుండా పార్టీ కూడా పూర్తిస్థాయిలో తెలంగాణలో లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది.ఈ విధంగా చెల్లెమ్మలు చేసిన పనుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు అన్నయ్యలు  సీఎం పదవులను మిస్ అయ్యారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: