ఎవరైనా ఏదైనా వేదిక దొరికినప్పుడు అందరికీ గుర్తుండిపోయాలా సందేహం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సందేహాలు కూడా చాలా స్ఫూర్తిదాయనీకంగా కూడా ఉంటాయి. ఇలాంటి మాటలు మాట్లాడడం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనల పైన ఆయన కొన్ని సెటైర్లు కూడా వేయడం జరిగింది.. ముఖ్యంగా పాలనలో ఉచితం అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి అంటూ కూడా వెంకయ్య నాయుడు ఉపదేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


ప్రజలకు రాజకీయ పార్టీలే ఈ ఉచిత అనే పదాన్ని సైతం అలవాటు చేశారని కూడా తెలియజేశారు. ఉచిత పథకాలను వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారని కడుపు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత పథకాల మీద కోపంగానే ఉంటారు అంటూ తెలిపారు. ఉచితం వద్దని ప్రస్తావించిన విషయం మాత్రం ఒక్కదాని మీద ఆయన మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఉచిత కరెంటు పైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది.. వెంకయ్య నాయుడు తాను ఒక పార్టీలో వ్యక్తిని అనడం లేదని తెలియజేశారు.


మౌలిక వసతులు ఇవ్వాలి తప్ప ఉచిత పథకాలు ఇవ్వకూడదని ఇలాంటి ప్రకటనలతో పార్టీలు పోటీపడుతున్నాయని వెల్లడించారు.. మరి ఇలాంటి ఉచిత పథకాలకు వెనుకడుగు వేసే వెంకయ్య నాయుడు తన ఆత్మీయుడైన చంద్రబాబుకు కూడా ఇలాంటి సలహాలు ఇవ్వచ్చు కదా అంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు..వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మాత్రమే తీసుకు వస్తే ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్ని ఉచిత పథకాలే అంటూ.. ఉచిత ప్రయాణం, మహిళలకు 1500 ,ఉచిత గ్యాస్ సిలిండర్స్ వంటి ఎన్నో పథకాలు కూడా పెట్టారు.. ఒకవేళ వెంకయ్య నాయుడు ఇలాంటి ఉచిత పథకాల పైన మాట్లాడాల్సి వస్తే ముందుగా చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా సలహా ఇవ్వచ్చు కదా అంటూ ప్రజలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: