•కేసీఆర్, వైయస్సార్.. గొప్ప నేతలే కానీ..

•కేటీఆర్,  జగన్ లకు తిప్పలు తప్పవా

•అది నమ్మకమే వారసుల భవిష్యత్తును దెబ్బతీస్తోందా..


(ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ - ఇండియా హెరాల్డ్)


ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో మహానేతల బిడ్డలకు తిప్పలు తప్పడం లేదు అని స్పష్టం అవుతోంది.. వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఆయన మరణాంతరం.. వైయస్సార్ అనే పార్టీని ఏర్పాటు చేసి 2014 ఎన్నికలలో జగన్ పోటీ చేసిన గెలవలేకపోయారు..  కానీ 2019 ఎన్నికలలో ఎలాగైనా సరే గెలవాలని వైయస్సార్ ముద్దుబిడ్డగా ప్రజలలో మమేకమవుతూ.. ఎవరు ఊహించని విధంగా 151  సీట్లతో ఘనవిజయం సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన కుటుంబంలో వారు పూర్తిస్థాయిలో కష్టపడ్డారు.. ముఖ్యంగా బాబాయ్ వివేకానంద రెడ్డి, చెల్లెలు షర్మిల,  తల్లి విజయమ్మ అందరి కష్టం ఇక్కడ కనిపించింది అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఘోర పరాభవాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా షర్మిల ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా నిలిచింది. తండ్రి మహానేత కావడంతో జగన్కు ఆ పరంగా కలిసి వస్తుందని జగన్ అనుకున్నారు. పైగా 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఈయన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేశారు.. అవే తనను గెలిపిస్తాయని గుడ్డిగా నమ్మారు. పైగా నిరుద్యోగులను పట్టించుకోలేదు.. అభివృద్ధికి బాటలు వేయలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక కూటమి అనూహ్యంగా ఈసారి ప్రజల నమ్మకాన్ని చూరగొని కేవలం 11 సీట్లకే వైఎస్సార్ పార్టీని పరిమితం చేసింది. ప్రజలే తనను గెలిపిస్తారని అతి నమ్మకం మీద ఉన్న జగన్ ను పూర్తిస్థాయిలో ఓడించారు.

అయితే ఇలాంటి పరిస్థితి అక్కడ తెలంగాణలో కూడా ఏర్పడింది. 2013, 2018 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. ఇక ఈసారి కూడా అధికారంలోకి వస్తామని తన కొడుకు కేటీఆర్ ను ఎలాగైనా సరే ముఖ్యమంత్రి చేయాలని కేసిఆర్ ఎన్నో కలలు కన్నారు. అయితే అదే సమయంలో కేటీఆర్ చెల్లెలు కవిత లిక్కర్స్ స్కామ్ లో ఇరుక్కోవడం.. నిరుద్యోగులకు సరైన సమయంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని నిందలు.. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని ప్రచారాలు.. పైగా కుటుంబంలో చీలికలు ఉన్నాయని విషయం బిఆర్ఎస్ పార్టీకి పూర్తిస్థాయిలో నెగిటివ్గా నిలిచాయి. ఇక మళ్లీ అధికారంలోకి తామే వస్తామని హ్యాట్రిక్ కొడతామని అనుకున్నారు.. ప్రజలు తమ వెంట నిలిచారని అతిగా నమ్మారు. కానీ ఆ నమ్మకం పూర్తిగా కోల్పోయి కనీసం 40 సీట్లు కూడా రాలేనంత దారుణంగా ఓడిపోయారు. ముఖ్యంగా ఎంపీ సీటు ఒక్కటి కూడా గెలవకపోవడం గమనార్హం.. తండ్రి చొరవతో మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు అని ఆశపడ్డ కేటీఆర్.. తన తండ్రి మహానేత తాను కూడా ప్రజలకు మేలు చేస్తున్నాను.. మళ్ళీ అధికారంలోకి వస్తాను అని అనుకున్న జగన్ , మరోవైపు తండ్రి చొరవతో ముఖ్యమంత్రి కావచ్చు అన్న కేటీఆర్  అతి నమ్మకం ఎట్టకేలకు భవిష్యత్తును నాశనం చేసిందని చెప్పవచ్చు.. మరి ఇకనైనా వీరు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొంది మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణలో 2028 ఎన్నికలలు,  ఆంధ్రప్రదేశ్లో 2029 ఎన్నికలు అటు కెసిఆర్ బిడ్డకు ఇటు వైయస్సార్ బిడ్డకు ఏ విధంగా కలిసి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: