* వైఎస్ కుటుంబాన్ని నాశనం చేస్తున్న కుటుంబ కలహాలు!  
* కుటుంబ కలహాలతో పతనమవుతున్న జగన్, షర్మిళ!
* కొడుకు కూతురు మధ్యలో అయోమయంలో ఉన్న విజయమ్మ!


( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): దారుణంగా ఓడిపోయిన వైసీపీలో రాష్ట్ర రాజకీయాల కంటే కుటుంబ రాజకీయాలే అడ్డంకులుగా మారాయి.వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మంచి కుటుంబం లాగా కనిపించినా ఆయన చనిపోయాక మాత్రం ఫ్యామిలిలో పలు బేధాలు చోటు వచ్చాయి. 2014 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. ఐతే అప్పుడు పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2019 లో కూడా వైఎస్ జగన్ తన కుటుంబం అండతో గెలిచి అధికారంలోకి వచ్చాడు. అయితే అధికారంలో ఉన్న జగన్ మార్పు ఆయన కుటుంబాన్ని క్రమంగా దూరం చేసింది. దాంతో తల్లి విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. చెల్లి షర్మిల మాత్రం తెలంగాణాలో తండ్రి సెంటిమెంటుతో సొంత పార్టీ పెట్టింది. ఐతే ఆమె సెంటిమెంట్ వర్క్ ఔట్ కాలేదు. దాంతో ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా దారుణంగా వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసింది. వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసుపై సునీత జగన్ మోహన్ రెడ్డిని ఘోరంగా బ్యాడ్ చేసింది. ఇలా కుటుంబం మొత్తం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాగా ఆ కారణాలు కూడా ఆయన్ని ఓటమి పాలయ్యేలా చేశాయి.

ఎన్నికల్లో షర్మిల కడప లోక్ సభ నుంచి పోటీ చేయగా విజయమ్మ షర్మిల కోసం వీడియో బైట్ ఇచ్చి ఆమెను ఆశీర్వదించమని కూతురుకి సపోర్ట్ చేసింది. కానీ కొడుకు జగన్ మోహన్ రెడ్డి కోసం ఎలాంటి మాటా చెప్పక సపోర్ట్ చెయ్యలేదు. ఐతే  వైఎస్సార్ జయంతి నాడు  కొడుకు, కోడలితో పాటే ఇడుపులపాయకు ఆమె వచ్చారు. తను కొడుకు పక్షానే ఉన్నానని విషయం అర్ధమవుతున్నా ఎన్నికల్లో షర్మిలకు ఎందుకు వీడియో బైట్ ఇచ్చారన్నది మాత్రం వైసీపి అభిమానులకు అర్ధం కావట్లేదు.ఇక ఎటొచ్చి వెళ్లినా కూడా జగన్, షర్మిల ఇద్దరు తన పిల్లలే కాబట్టి ఒకరిని కాదని మరొకరిని దగ్గరకు తీసుకునే అవకాశం లేదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరిని కలిపి ఒకచోట చేర్చే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని సార్లు కూతురికి సపోర్ట్ చేస్తుంది. కొన్నిసార్లు కొడుకుకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాని ఇద్దరితో మాట్లాడి కలపాలని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ ఆమె మాట్లాడిన వాళ్లిద్దరూ కలిసే పరిస్థితి లేదని తెలుస్తుంది. మొత్తానికి అటు జగన్ ఇటు షర్మిల మధ్యలో వైఎస్ విజయమ్మ నలిగిపోతుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: