కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలే పెద్దపెద్ద ప్రమాదాలను సృష్టిస్తాయనే సంగతి తెలిసిందే. గోటితో పోయే సమస్యలను గొడ్డలి వరకు షర్మిల, కవిత తీసుకొచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల ఏపీలో వైసీపీ పవర్ కోల్పోవడానికి కారణం కాగా తెలంగాణలో కవిత బీ.ఆర్.ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా చేశారనే చెప్పాలి. షర్మిల జగన్ ను ఇరుకున పెట్టాలని రాజకీయాలు చేస్తుండగా కవిత తాను కేసుల్లో చిక్కుకుని పార్టీని ఇబ్బందుల్లో పెట్టారు.
 
షర్మిల, కవిత ఇద్దరి పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనని వీళ్లు రాజకీయాల్లో సాధించేది కూడా ఏమీ ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ రాజకీయాలలో తమకు ఉన్న ఇమేజ్ ను సైతం అంచెలంచెలుగా తగ్గించుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు టీడీపీ షర్మిలను పావులా వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
 
కవిత అవినీతి కేసుల్లో చిక్కుకుని కల్వకుంట్ల కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ విషయంలో కవితకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కవిత కుటుంబానికి వ్యతిరేకంగా కావాలని ఏమీ చేయలేదు. షర్మిల మాత్రం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ఏ అవకాశం వదులుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
షర్మిల భవిష్యత్తులో ఏపీకి సీఎం కావాలని కలలు కంటున్నా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ద్వేషం ఆమెకు మైనస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కవిత జైలు నుంచి బయటికొస్తే మాత్రమే పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వివేకా హత్య కేసు గురించి స్పందించడం లేదు. జగన్ ను షర్మిల ఇంతలా టార్గెట్ చేయడానికి గల కారణాలు సైతం ఎవరికీ అర్థం కావడం లేదు. షర్మిల, కవిత రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఎంత కష్టపడినా ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: