• రాజకీయాల్లో కష్టాలు అనేవి కామన్  

• కష్టాలు అనుభవిస్తున్న వారిపై సానుభూతి రావడమూ సహజమే  

• కానీ వైఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీలపై నో సింపతీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం 39 సీట్లకే పరిమితమయ్యారు. ఎంపీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. కేసీఆర్ బిడ్డ కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుంది. ఖైదీగా 120 రోజులుగా తీహార్ జైలులో మగ్గిపోతోంది. కవితకు బెయిల్ కూడా దొరకట్లేదు. ఒకవైపు రాజకీయంగా పతనం కావడం మరోవైపు బిడ్డ జైలుకు వెళ్లడం వల్ల కేసీఆర్ తీవ్ర బాధలో మునిగితేలుతున్నారు. పార్టీ రోజు రోజుకు మరింత బలహీనంగా తయారవుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతిని రేవంత్ రెడ్డి బయటపెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అప్పుడే వద్దు అన్నట్లు అతడిని ఆపుతున్నట్లు తెలుస్తోంది.

కానీ ఏడాది - రెండేళ్లలో హరీష్ రావు, కేటీఆర్ జైలుకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇంత జరుగుతున్నా, చాలా కష్టాలను ఫేస్ చేస్తున్నా ప్రజల్లో మాత్రం సింపతీ అసలు కలగడం లేదు. వారిపై అంతకంతకూ ఇంకా కసి తీర్చుకోవాలనే ప్రజలు చూస్తున్నారు. ఓట్ల ద్వారా ఈ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 11 సీట్లతో జగన్ 151 సీట్ల నుంచి అదఃపాతాళంలోకి పడిపోయారు. సంక్షేమ పథకాల పేరిట ఎంతో మందికి ఇల్లు ఇచ్చారు. పెన్షన్లు ఇచ్చారు. ఇంటింటికి రేషన్ సరఫరా చేశారు. స్కూళ్లు బాగు చేశారు. పిల్లగాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారు. ఇంకా చాలానే లబ్ధి చేకూర్చారు. ఇంత చేసినా అతని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేశారు.

జగన్ చెల్లి వ్యతిరేకమైతే నవ్వారు. జగన్ ఒక జోకర్ అంటూ దారుణంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నామనే కొంచెం కూడా కృతజ్ఞతా భావం లేకుండా జగన్ ఓటమికి ఆయన చేసిన తప్పులే కారణం అని మాట్లాడుతున్నారు. జగన్ ఫ్యామిలీ పై కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. షర్మిల తన సొంత అన్న మీదనే పోరాటం చేస్తూ వైయస్ ఫ్యామిలీ పరువును గంగలో కలుపుతున్నారు. జగన్ మూర్ఖంగా ఆలోచిస్తారని అందుకే చెల్లి, తల్లి ఇద్దరూ దూరమయ్యారని అంటున్నారు. మొత్తం మీద ప్రజల్లో వైఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీలపై సింపతీ కొంచెం కూడా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: