2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనూహ్యమైన ఫలితాలకు కారణమయ్యారు అనే విషయం తెలిసిందే. ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని నేలకేసి కొట్టినంత పని చేశారు ప్రజలు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన వైసిపి పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితుల్లో గెలిపించారు. ఏకంగా 175 స్థానాలకు గాను అటు వైసిపి కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.


 అయితే ఇలా అధికారంలో ఉన్న పార్టీ ఇంతటి దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవడం ఆంధ్ర పొలిటికల్ హిస్టరీ లోనే మొదటిసారి. అయితే తెలంగాణలోని ఇలాంటిదే జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా ప్రస్తానాన్ని కొనసాగించిన బిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే బిఆర్ఎస్కు తిరుగులేదని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అందరూ అనుకుంటుండగా.. తెలంగాణ ప్రజలు మాత్రం మరొకటి తలిచారు. ఏకంగా బిఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం చేశారు. 39 స్థానాలలో మాత్రమే గెలిపించారు.


 ఇలా అధికారంలో ఉన్నప్పుడు మంచి స్నేహబంధాన్ని కొనసాగించిన ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజలు షాక్ ఇచ్చారు అని చెప్పాలి. కానీ ఓడిన అటు సీఎం కేసీఆర్ మాత్రం జగన్ కంటే గ్రేట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 175 స్థానాలకు గాను అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.  అయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడినప్పటికీ 39 స్థానాల్లో విజయం సాధించి బలమైన ప్రతిపక్ష హోదాని దక్కించుకుంది అని చెప్పాలి. అది కూడా కేవలం 119 అసెంబ్లీ స్థానాలలో 39 గెలుచుకోగలిగింది బిఆర్ఎస్. ఇలా ఓడిపోయినప్పటికీ  బలమైన ప్రతిపక్ష హోదా దక్కించుకోవడంలో సక్సెస్ అయింది అని చెప్పాలి. అందుకే ఓటమిపాలైనప్పటికీ జగన్ కంటే కేసీఆర్ ఎంతో గ్రేట్ అంటూ రాజకీయ విశ్లేషణ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: