* కేసీఆర్ కూతురు జైలు పాలు
* 10 ఏళ్ళ అధికారం కోల్పోవడం
*గెలిచినా ఎమ్యెల్యేలు జంప్
*జగన్, షర్మిలకు ఓటములు
*జగన్, షర్మిలల గొడవలు

 రెండు తెలుగు రాష్ట్రాలలో... వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన  ఉద్యమ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు... 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల పాలిట దేవుడిగా మారిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న ఈ రెండు కుటుంబాలను ఇప్పుడు కష్టాలు.. వెంటాడుతున్నాయి.

 మొదటగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి మాట్లాడుకున్నట్లయితే... 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్న కెసిఆర్ కు.. రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. 39 స్థానాలకే గులాబీ పార్టీని  కాంగ్రెస్... పరిమితం చేసింది. అనంతరం... కెసిఆర్ ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్నారు. అంతేకాదు ఆమె దాదాపు 120 రోజులుగా.. జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

 ఇలా వరుసగా రెండు దెబ్బలు తగిలిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. గులాబీ పార్టీ పుట్టిన 23 సంవత్సరాల లో.. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు లేకుండా ఎప్పుడు లేదు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ జీరో స్థానాలకు పరిమితమైంది. దీంతో గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు జారుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. దీంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్ని వ్యూహాలు పన్నినా ఫలించడం లేదు.

 ఇటు వైయస్ విజయమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి... ఓడిపోవడంతో ఆమె కూడా కుమిలిపోతున్నారట. అటు తెలంగాణలో వైయస్ షర్మిల... అట్టర్ ఫ్లాప్ కావడం...  ఇక్కడ కడప ఎంపీగా షర్మిల ఓడిపోవడం కూడా... విజయమ్మను వేధిస్తుందట. ఇక మొన్నటి ఎన్నికల్లో... అటు షర్మిల, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులుగా మారడంతో వైయస్ షర్మిల ఎవరికి సపోర్ట్ చేయకుండా అమెరికా వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత... వారిద్దరి ఓటమిని విజయమ్మ భరించలేకపోతున్నారట.  ఇలా కెసిఆర్ ఇటు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలలో.. కష్టాలు.. పెరుగుతూనే ఉన్నాయి. అయితే మరో ఐదు సంవత్సరాల తర్వాత ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే... రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పడం గ్యారంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp