ఆంధ్ర రాజకీయాల్లో నారా లోకేష్ ది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. స్వతహాగా చంద్రబాబు వారసుడు అయినటువంటి లోకేష్ ఈరోజు సక్సెస్ అయ్యాడంటే అది ఒక్క రోజులో రాలేదు. దాదాపు పదేళ్లు పాటు అధికారం, ప్రతిపక్షంలో ఉంటూ ఒక రాటు దేలారు. ఈ క్రమంలో ప్రత్యర్ధులు తరచూ అన్న మాట పప్పు కాదు నిప్పు కణిక అని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో చాలా మందికి రోల్ మోడల్ గా కూడా నిలిచారు లోకోష్. ఈ తరుణంలో లోకేష్ ని బీఅర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ ఫాలో అవుతున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ వేడిగా సాగుతోంది. ఇక అది ఏ విషయంలో తెలుసుకోవాలంటే.. మీరు ఈ మేటర్ మొత్తం చదవలసిందే.

విషయం ఏమిటంటే... చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినపుడు లోకేష్ ఏకంగా ఢిల్లీకి వెళ్లి అక్కడే వారాల తరబడి తిష్ట వేశారు. ఈ క్రమంలో వారితో టై అప్ అయి వాళ్లతో సీట్ల సర్దుబాటు చేసుకుని సక్సెస్ ఫుల్ గా చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఇపుడు అదే ఫార్ములాను కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మేటర్ ఏమిటంటే... కేటీఆర్ కూడా ఇపుడు ఢిల్లీలోనే తిష్ట వేసాడు మరి. అవును, లోకేష్ మాదిరిగానే ఢిల్లీ మీడియాతో టచ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని ఎక్కువగా విమర్శిస్తూ బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దాంతో బీజేపీ కవిత విషయంలో ఏమైనా సానుకూలతతో వ్యవహరిస్తుందని కేటీఆర్ నమ్మకం.

అయితే గతంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సందర్భం వేరు. అపుడు ఎన్నికలు దగ్గరలో ఉండడంతో ఏపీలో బీజేపీకి అవసరం చాలా ఏర్పడింది. అప్పటికే ఏపీలో పొత్తుల కోసం బీజేపీ గట్టిగా ట్రై చేస్తోంది. అయితే తానుగా ముందుకు రాని నేపధ్యంలో లోకేష్ చొరవ తీసుకోవడంతో అది చాలా సులువు అయింది. ఇక ఇప్పటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఇపుడు ఎన్నికలు లేవు. పైగా బీఆర్ఎస్ తో తెలంగాణాలో బీజేపీకి ఏ రకమైన అవసరమూ రాజకీయంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని కోరి నెత్తిన పెట్టుకుంటే అది కాంగ్రెస్ కి నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అన్న అనుమానం కమలనాథుల్లో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీర్ పాచిక పడుతుందా అనే అనుమానం కలగక మానదు!

మరింత సమాచారం తెలుసుకోండి: