అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు.. ఎన్నికల ముందు టిడిపి, వైసిపి మధ్య జరిగిన సంఘటనలు యుద్ధ వాతావరణమాన్ని తలపించాయి.. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా పలుచోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.. రాయదుర్గం మండలంలో మెచ్చారి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త అదెప్పా ను చాలా దారుణంగా హత్య చేసి చంపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టిడిపి కార్యకర్తను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపినట్లుగా తెలుస్తోంది.



ఆదెప్పా మృతి దేహాన్ని సైతం.. గ్రామ శివారులో పడేసినట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఈ హత్య జరిగిందనే విధంగా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఆదెప్పా మంగళవారం వ్యక్తిగత పనిమీద సరిహద్దులో ఉండే కర్ణాటక ప్రాంతానికి వెళ్లి వస్తే తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో వస్తూ ఉండగా ఈ హత్య జరిగినట్లుగా ఆయన బంధువులు తెలియజేశారు. పెద్ద గుడారం వెళ్లే మార్గంలో ఈయన మృతి దేహం చూసిన కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటహుటిగా సిఐ శ్రీనివాసులు ఈ సంఘటన ప్రదేశానికి వెళ్లి అక్కడ పరిశీలించినట్లు తెలుస్తోంది.



ఆదెప్పా ఇంటి వద్ద నుంచి టూవీలర్ ను పక్కనే వదిలేసి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి ఉంటారని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. మరో వాదన తెరమీదికి వినిపిస్తున్నది ఏమిటంటే గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజారి విషయంలో గత కొంతకాలంగా టిడిపి వైసిపి మధ్య ఆదిపత్య పోరు కూడా కొనసాగుతున్నదని టిడిపి అధికారంలోకి రావడంతో రెండు రోజుల క్రితమే దేవాలయం తలుపులు తెరిపించి మరి పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లుగా ఆ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఆదెప్పా పూజ చేయడం కూడా అక్కడున్న కొంతమంది వైసిపి నాయకులు అడ్డుకోవడం పలు రకాల ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: