ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి... ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఏపీ ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడని కొంతమంది... తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 175 స్థానాలు గెలుస్తామని చెప్పిన వైసీపీ పార్టీ... కనీసం 50 నుంచి 70 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు తెలిపాయి. కానీ పరిస్థితి మాత్రం... పూర్తి విరుద్ధంగా మారిపోయింది. అయితే ఇదే విషయంపై.. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.


తాజాగా ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్... చిట్ చాట్ లో... జగన్మోహన్ రెడ్డి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేది కాదని ఆయన వివరించారు. కొన్ని కుట్రల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగిందని తెలిపారు. నిత్యం జనాల్లో ఉండే కేతిరెడ్డి ఓడిపోవడం ఇంకా దారుణం అన్నారు. కేతిరెడ్డి ఓటమితో ఏపీ ఎన్నికలపై చాలా అనుమానాలు ఉన్నాయని తెలిపారు కేటీఆర్.

 
ఇక వైయస్ షర్మిలను వాడుకొని... జగన్ పై కుట్రలు చేశారని తెలుగుదేశం పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కానీ వైయస్ షర్మిల మాత్రం సాధించింది ఏదీ లేదని... ఎంపీగా కూడా ఓడిపోయిందని చురకలు అంటించారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం తమ్ముళ్లు  సెటైర్లు పేల్చుతున్నారు. గులాబీ పార్టీ ఓడిపోయిన దాని పైన దృష్టి పెట్టకుండా పక్క రాష్ట్రాల రాజకీయాలు నీకెందుకు అంటూ ఫైర్ అవుతున్నారు.

 
షర్మిలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని... ఆస్తుల విషయంలో... షర్మిలకు మోసం జరిగిందని తెలుగు తమ్ముళ్లు తెలిపారు. త్వరలోనే కల్వకుంట్ల కవిత కూడా... కేటీఆర్ ఆస్తుల  కోసం తిరుగుబాటు చేస్తుందని కూడా తెలుగు తమ్ముళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడు.. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల వివాదం కేటీఆర్ కు అర్థం అవుతుందని... మండిపడుతున్నారు. ఎవరికైనా... ఆ సమస్య వస్తే అర్థమవుతుందని...  అప్పటిదాకా కేటీఆర్ లాగే చాలామంది మాట్లాడుతారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: