తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గులాబీ పార్టీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో... ఆ పార్టీలో ఉన్న నేతలు అందరూ... జారుకుంటున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీని వీడిన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్లు , మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు.

 ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత వారం కిందట ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు  కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు... వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరో 19 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరితే... బిఆర్ ఎస్ ఎల్ పి.... కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రమాదం ఉంది.

 అయితే ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను...  తమ పార్టీలో చేర్పించుకునేందుకు... బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి... ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిజెపి ఎదగాలని చూస్తోంది.  ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించిందట బిజెపి. ఒకేసారి గంపగుత్తగా... ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకొని... టిఆర్ఎస్ ఎల్పీ ని కూడా విలీనం చేసేలా స్కెచ్ వేస్తోందట.

అయితే బండి సంజయ్ మాత్రం... ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతనే... తమ పార్టీలో చేర్పించుకుంటామని చెబుతున్నారు. కానీ బిజెపి కేంద్ర పెద్దలు మాత్రం.. వచ్చిన లీడర్ ను వచ్చినట్టుగా... బిజెపి కండువా కప్పేయాలని ఆదేశించారట. మరో రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అటు టిఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు... రేవంత్ రెడ్డి కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి రెండు జాతీయ పార్టీల రాజకీయాలతో ప్రాంతీయ పార్టీ అయిన... కెసిఆర్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp