- కాంగ్రెస్ లో చేరేందుకు రాయ భేరాలు
- మంత్రి ప‌ద‌వి కావాల‌ని ప‌ట్టు
- అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పిన రేవంత్ ..?

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు. కార్పొరేటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన తలసాని.. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. చంద్రబాబు దయతో మంత్రి అయిన తలసాని గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలతో పాటు.. తెలంగాణలో తనదైన ముద్రవేశారు. అయితే అలాంటి తలసాని తనకు రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని వీడీ.. అధికార దాహంతో బిఆర్‌ ఎస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీని వీడిన కూడా తలసాని తనకు జన్మనిచ్చిన తెలుగుదేశం.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.


వాస్తవానికి 2009 ఎన్నికలలో ఓడిపోయిన తలసానికి 2014 ఎన్నికలలో చంద్రబాబు సీటు ఇవ్వలేని పక్షంలో.. ఆయనను బతిమిలాడుకుని సనత్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బిఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. ఇక గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో తలసాని వరుసగా మూడోసారి విజయం సాధించారు. అయితే టిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మంత్రిగా అధికారం వెలగబెట్టారు. అదే టైంలో తన తనయుడు సాయికిరణ్‌ను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకోలేకపోయారు.


ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. తలసాని రాయబారం పంపుతున్నారట. బిఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తలసాని తనకు మంత్రి పదవి ఇస్తే తాను కూడా పార్టీ మారతానని చెప్పినా రేవంత్ లైట్ తీసుకున్నారట. తలసాని అవకాశవాద రాజకీయం చేస్తారని.. ఆయన అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్లిపోతారని.. అలాంటి నేత తనకు అవసరం లేదని రేవంత్ కరాకండిగా తేల్చి చెప్పినట్టు తెలంగాణ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: