ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తానని భావించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ జనాలు.. ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ తీర్పు ఇచ్చారు. కానీ వినీ ఎరుగని రీతిలో కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేని నేతగా మిగిలిపోయారు. ఇప్పుడు జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాధాన్యత్వం వహిస్తున్న ఎమ్మెల్యేగా జగన్ మిగిలిపోయారు. జగన్ ఎంత అరిచి మొత్తుకున్నా అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితి లేదు.


ఓవైపు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు.. ఎన్నికలలో పార్టీకి వెన్నుపోట్లు పొడిచిన నేతలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజా మాజీ వైసీపీ ఎమ్మెల్యే పై జగన్ వేటు వేశారు. కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పెనుబల్లి వెంకట సిద్ధారెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.


ఇటీవల జరిగిన ఎన్నికలలో సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడుతున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. 2019 ఎన్నికలలో సిద్ధారెడ్డి కదిరి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ ఆయనకు సీటు ఇవ్వలేదు. మైనార్టీ కోటాలో పెద్దిరెడ్డి అనుచరుడు అయిన ముక్బూల్ కు టిక్కెట్ ఇచ్చారు. ఎన్నికలలో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ముక్బూల్‌ ఓటమికి పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి జగన్‌కు నివేదించడంతో.. జగన్ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: