ఏపీ రాజకీయాల్లో ఇటీవల కూటమి ఎటువంటి ఫలితం సాధించిందో ప్రస్తుతం చెప్పుకోవలసిన పనిలేదు. ఈ క్రమంలో టీడీపీ అధికారం చేజిక్కించుకొని ప్రజల వద్దకు పాలన అన్న రీతిలో పరిపాలన కొనసాగిస్తోంది. జనసేన అధినేత ఈసారి 21 స్థానాలకు 21 సాధించి చరిత్రను సృష్టించి గేమ్ చెంజర్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో బాబు సరిగ్గా నెల రోజుల క్రితం 24 మంది మంత్రులను తీసుకుని ప్రమాణం చేయించారు. దాంతో ఒక్క ఖాళీ ఏర్పడింది. అంటే మొత్తం 25 స్థానాలకు గాను 24 మందిచేతే ప్రమాణం చేయించారు. ఇప్పటికీ ఆ ఖాళీ అలాగే ఉండడం కొసమెరుపు. దాంతో కేబినెట్ మంత్రి పదవి మిగిలిన వారిని చాలా డిస్టర్బ్ చేస్తోంది. ఎందుకంటే కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి.

అంటే ఒక్క మంత్రి పదవి కోసం వందకు పైగా ఎమ్మెల్యేలు ఇక్కడ ఆశతో ఎదురు చూస్తున్నారు. అందులో టీడీపీ వారితో పాటు కూటమిలోని బీజేపీ జనసేన ఎమ్మెల్యేల కన్ను కూడా ఈ ఒక్క ఖాళీ సీటు మీదనే పడింది. అందుకే ఆ ఒకే ఒక్క మినిస్టర్ పదవి ఎవరికి దక్కొచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వాడివేడిగా నడుస్తోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన అన్ని మంత్రి పదవులూ ఇచ్చేసి మరీ ఒక్క బెర్త్ ని అలా ఉంచారు అంటే దాని వెనుక ఎదో రహస్యం దాగి ఉంటుంది అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో సీనియర్ మోస్ట్ నేత మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామక్రిష్ణుడికి అయితే ఆ సీటు కేటాయిస్తే బావుంటుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

దాంతో పాటుగా మంత్రి వర్గంలో చూసుకుంటే ఓవరాల్ గా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దగా చాన్స్ ఇవ్వలేదు కాబట్టి వారి నుంచి ఈ మంత్రి పదవిని భర్తీ చేస్తే బావుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. అదే విధంగా పిఠాపురంలో జనసేన గెలుపు వెనకాల కొండంత అండగా నిలబడి తన సీటుని త్యాగం చేసిన వర్మకు ఆ మంత్రి పదవి ఇస్తే బావుంటుందని జనసేన వర్గం అనుకుంటున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు బీజేపీ మాకు మరొకటి కావాలంటూ ఆశ పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్ని ఆశల నిరాశల మధ్య చంద్రబాబు దూర దృష్టితో ఆ ఖాళీని ఎవరికి కేటాయిస్తారు అన్నదే ఇపుడు అంతులేని ప్రశ్న!

మరింత సమాచారం తెలుసుకోండి: