ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకాల పైన ఎక్కువగా దృష్టి పెట్టి తాను చేస్తానన్న వాటిపైన మొదటి సంతకాలను చేశారు ఏపీ సీఎం.. ముఖ్యంగా అన్ని అమలు చేసే విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు మాట ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా ఆ వైపుగానే అడుగులు వేయిస్తున్నారు.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మరొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు. ఇప్పటికే పెన్షన్ పెంపు ఉచిత ఇసుక హామీ పథకాలను కూడా అమలు చేసిన ఏపీ ప్రభుత్వం..



ఇప్పుడు తాజాగా ఎన్నికల హామీల భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కల్పిస్తామంటూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం పైన కసరత్తు చేస్తున్నారట.. ఈ హామీ పైన ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు బీమా సౌకర్యంతో వైద్య సేవలు అందించే విధంగా కూడా ప్రతిపాదనలు తీసుకువచ్చేలా ఆదేశాలను జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల వరకు బీమా సేవలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందట.


ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల పరిమితికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని పెంచింది.. కేంద్ర పరిమితితో కలుపుకొని రాష్ట్రంలో 25 లక్షల రూపాయల వరకు పరిమితి కల్పించాలి అంటూ ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది వీటి పైన మరో రెండు మూడు రోజులలో స్పష్టత వచ్చేలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు మరో కొద్ది రోజులలో తెలియబోతోంది. ప్రస్తుతం ఈ విషయమైతే ఏపీ ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: