ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే ఒక మీడియా సంస్థ పైన జరిగిన దాడికి సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం పై కూటమి యూటర్న్ అంటూ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక అయిన డెక్కన్ క్రానికల్ ప్రకటించడంతో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన సదురు వీడియో సంస్థ ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది.. అయితే ఇలా ప్రకటించడంతో టీడీపీ పార్టీకి అనుసంధానమైన పలువురు కార్యకర్తలు ఈ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసినట్లు తెలుస్తోంది.


అలాగే డిసి ఆఫీసులో ఫర్నిచర్స్ ధ్వంసం అయినట్లుగా సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన కూటమి యూటర్న్ అని శీర్షికతో ఒక కథనం రాయడమే ఇందుకు ముఖ్య కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పట్ల లోకేష్ స్పందిస్తు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని సైతం దెబ్బతీసేలా ఈ పత్రిక కథనాన్ని ప్రచురించింది అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంని పూర్తి వైభవంతో తిరిగి పొందేల తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా తెలిపారు నారా లోకేష్.


డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన జరిగిన దాడి విషయంలో మాజీ సీఎం స్పందిస్తూ ఇది పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్విట్టర్లో ఒక పోస్ట్ ని షేర్ చేశారు దేనిని గుడ్డిగా లాగకుండా నిష్పక్షపాతంగా నడుచుకొని మీడియాని సైతం అణిచివేసేందుకు ఈ ప్రభుత్వం మరొక ప్రయత్నం చేస్తోంది అంటూ తెలియజేశారు. కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజాస్వామ్యం రోజు రోజుకి నిరంతరం ఉల్లంఘించబడుతోంది అంటూ తెలిపారు.. ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ సీఎం బాధ్యత వహించాలి అంటూ కూడా మాజీ సీఎం జగన్ చంద్రబాబు పైన విమర్శలు కురిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్ అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: