ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత.. దారుణమైన పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోవడంతో.. ఆ పార్టీలో కల్లోలం నెలకొంది. ఎప్పుడు ఏ నేత బయటకు వెళ్తాడో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే పెద్దిరెడ్డి, విజయ్ సాయి రెడ్డి లాంటి పెద్ద లీడర్లు.. బిజెపి వైపు చూస్తున్నారని మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.

 

ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో... ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్... పార్టీ మారబోతున్నారట. ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత... వైసిపి క్యాడర్ కు చాలా దూరంగా ఉన్నారు. ఇప్పటివరకు ఓటమి తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు బుగ్గన రాజేంద్రనాథ్.


ఈ మధ్యకాలంలో బీజేపీ కేంద్ర పెద్దలతో టచ్లోకి వెళ్లారట మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేం ద్రనాథ్. వైసీపీని వీడి త్వరలోనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. బుగ్గన రాజేంద్రనాథ్ కు... ఏపీ, తెలంగాణ, తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాలలో మైనింగ్ మరియు సిమెంట్ కంపెనీలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉంటే తమ కంపెనీలకు ఇబ్బంది కలిగి అవకాశాలు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ అనుకుంటున్నారట.


రిస్కు తీసుకోకుండా బిజెపి పార్టీలో చేరేందుకు... రంగం సిద్ధం చేసుకున్నారట బుగ్గన రాజేంద్రనాథ్. అన్ని కుదిరితే వచ్చే నెలలోపు  బిజెపి కండువా కప్పుకోబోతున్నారట. అయితే వైసిపి నేతలు మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్... పార్టీ మారే స్వభావం కాదని... ఆయన వైసీపీలో ఉంటారని చెబుతున్నారు. కాగా మొన్న జరిగిన ధోన్ అసెంబ్లీ ఎన్నికల్లో.. మాజీ ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన 6000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019, 2014  ఎన్నికల్లో గెలిచిన  మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఈసారి మాత్రం ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: