ఏపీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది.సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు తనను నేరుగా కలవకుండా చూసేందుకు ఓ కొత్త మార్గాన్నిచూపించారు లోకేష్.ఎన్నికల సమయంలో ప్రజలకు మాటివ్వడం రాజకీయ నేతలకు ఉన్న ప్రధాన అలవాటు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ..అధికారులు, కింది స్థాయి నేతలు మీ సమస్యలు పట్టించుకోకపోతే తాను స్వయంగా పరిష్కరిస్తానని మాటివ్వడం పరిపాటి.కాని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు చూసి..హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని వాగ్ధానం చేశారు.తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.తన వాట్సాప్‌ను మెటా సమస్త బ్లాక్ చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ బ్లాక్ అయినట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి తనకు వాట్సప్‌లో మెసేజ్ చేయొద్దు అని కోరారు.దీనికి ప్రతి కులంగా ఎపి విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పర్సనల్‌ మెయిల్‌ ఐడీని ప్రకటించారు.

సాయం కోసం వచ్చే వారికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్‌ ఐడీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లతో వాట్సాప్‌ బ్లాక్‌ కావడం, తరచూ ఇదే సమస్య  అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆ మెయిల్‌ తానే స్వయంగా చూస్తానని వివరించారు. పాదయాత్రలో యువతకు దగ్గర అయిన హలో లోకేశ్ కార్యక్రమం పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేశారు.నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం 16వ రోజుకు చేరింది. ఈరోజు నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: