• నెల రోజుల పాలనతో మురిపించిన బాబు! 


• ఆంధ్రాభివృద్ధికై విశ్రమించకుండా పనిచేస్తున్న బాబు! 


• ఆంధ్రుల్లో రాష్ట్రాభివృద్ధి నమ్మకాన్ని కలిగిస్తున్న బాబు!


అమరావతి - ఇండియా హెరాల్డ్: గత ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు ధ్వంసమైన రాష్ట్రాన్ని పుననిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి సరైన దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా చంద్రబాబు పనిచేస్తున్నారు. కేవలం నెలరోజుల పాలనలో తనదైన మార్కు చూపస్తు నిర్వీర్యమైన వ్యవస్తలను సరిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలలో రాష్ట్రాభివృద్ధి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నెలరోజుల పాలన పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు ఇంకా అభివృద్ది వైపు అడుగులు వేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యున్న కారణంగా పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇక అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధమైంది. బీపీసీఎల్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ స్థాపనపై వారితో చర్చలు జరిపారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడుతో చర్చల తరువాత ఏపీలో రిఫైనరీ పరిశ్రమను స్థాపించేందుకు బీపీసీఎల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రిఫైనరీ పరిశ్రమ స్థాపన కోసం ప్రాంతాల పరిశీలన ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. త్వరలోనే పరిశ్రమ ఎక్కడ స్థాపిస్తారన్న దానిపై పూర్తి క్లారిటీ రానుంది.ఇంకా అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. విహంగ వీక్షణం ద్వారా ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.ఇక మున్ముందు రోజుల్లో సిఎం చంద్రబాబు నాయుడు తన పాలనతో జనాలను ఇంకెంత బాగా మెప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: